Breaking News
Loading...

ISTA ప్రసిడెంట్ గా ఎంపికైన డా. కేశవులును అభినందించిన సీఎం కేసీఆర్

రైతుముచ్చట, హైదరాబాద్: ఆసియా ఖండంలోనే తొలిసారిగా అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ISTA) ప్రెసిడెంట్ గా భాత్యతలు స్వీకరించిన తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ(TSSOCA) & విత్తనాభివృద్ది సంస్థ(TSSDC) డైరెక్టర్ డా.కె.కేశవులును బుధవారం రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అభినందించారు. ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సంస్థకు అధిపతిగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపికవటం రాష్ట్రానికి విత్తన రంగంలో అంతర్జాతీయంగా మంచి కీర్తి లభించిందని, రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడానికి ఇది ఎంతగానో తోడ్పడనున్నది సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార సంస్థ (FAO) కూడా విత్తన భాండాగారంగా తెలంగాణను గుర్తించిన విషయాన్ని సంధర్భంగా సీఎం గుర్తుచేశారు.

Post a Comment

0 Comments