హర్యాన, రైతుముచ్చట: నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) లో శాశ్వత
ప్రాతిపాదికన 6 సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ (SHO) మరియు 8
హార్టికల్చర్ ఆఫీసర్ (HO) పోస్టుల నియామకానికి
సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా ICAR గుర్తింపు పొందిన
యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ లేదా అగ్రి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆయా సబ్జెక్టులలో కనీస మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు సీనియర్ హార్టికల్చర్
ఆఫీసర్ (SHO) పోస్టులకు అర్హులు కాగా మరియు ఏదైనా ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ తో
ఆయా కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పోర్తి చేసిన వారు హార్టికల్చర్
ఆఫీసర్ (HO) పోస్టులకు అర్హులు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ అప్లికేషన్
ఫామ్ లో తమ వివరాలను పొందుపరచి ఆగష్టు 24, 2021 లోపు మేనేజింగ్
డైరెక్టర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ప్లాట్ నంబర్-85, ఇనిష్టిట్యూషనల్ ఏరియా, గురుగ్రామ్, హర్యాన-122015 అడ్రస్స్ కు పంపించగలరు.
నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు & అప్లికేషన్ ఫామ్ కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/1fe91V32MMMrLOvMAv-SfI9fBdKk5FZ57/view?usp=sharing
0 Comments