Breaking News
Loading...

ఒక FPO ను ప్రారంభించడం ఎలా...?


FPO : “ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్

ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల రైతులు, సేంద్రీయ రైతులు, పాల ఉత్పత్తిదారులుమత్స్యకారులుహస్తకళాకారులుచేనేత వృత్తులవారు, ఇతర గ్రామీణ వృత్తులవారు గ్రూపులుగా ఏర్పడి "ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్" ను స్థాపించుకుంటారు.

ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్: ఇది రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రారంభించిన ఒక "ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్". ఇందులో సామర్థ్యత, ఆసక్తి గల 11 మంది క్రియాశీల రైతులు పైస్థాయిలో ఉండి FPO ను నడిపిస్తారు. FPO కి అర్హత పొందాలంటే క్షేత్ర స్థాయిలో కనీసం 300 మంది రైతులను సభ్యులుగా కలిగి ఉండాలి.

FPO ప్రారంభించాలని ముందుకొచ్చిన వారు చేయవలసిన విశ్లేషణ & అద్యయనం :

మొదటగా బిజినెస్ చేయాలనుకున్నవారు తమకు అనువైన క్లష్టర్ ని ఎంచుకోవాలి

ఆదాయాన్ని పెంచుకోవటానికి వ్యాపార కార్యాకలాపాల ప్రణాళిక తయారు చేసుకోవాలి

క్లష్టర్ లో సర్వే చేసి పెద్ద మొత్తంలో రైతులు సాగు చేసే, మార్కెట్ డిమాండ్ ఉన్న  పంటఉత్పత్తులను గుర్తించాలి

ఉత్పత్తులను అమ్ముకోవటానికి మార్కెటింగ్ సదుపాయాలను అంచనా వేసుకోవాలి

మొత్తం ఫీల్డ్ స్టడీ చేసి లాభ నష్టాలను, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను బేరీజు వేసుకోవాలి

క్షేత్ర స్థాయి రైతులతో సమావేశం:

మొదటగా తమ బిజినెస్ ఆలోచనను క్షేత్ర స్థాయిలో ఉండే ఇతర రైతులతో చర్చించాలి

తమ ఆదాయాన్ని పెంచుకోవటానికి రూపొందించిన ప్రణాళికను రైతుల ముందుంచాలి

నమ్మకం & అవగాహన కోసం ఆసక్తి గల రైతులను ఇతర FPOs సందర్శనకు తీసుకెళ్లాలి

మొదటగా ఎక్కువ ఆసక్తిగల క్రియాశీల రైతులను కలిపి ఒక "క్రిటికల్ గ్రూపు" గా ఏర్పాటు చేయాలి

వీరి ద్వారా క్లష్టర్ లోని ఇతర రైతుల యొక్క సందేహాలను నివృత్తి చేసి అవగాహన కల్పించాలి

దీనికి దాదాపుగా 3 నుండి 6 నెలల సమయం పడుతుంది.

ఇలా మొత్తం 300 మంది రైతులు సభ్యులుగా ఉండి ఒక "ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీగా" ఏర్పడవచ్చు

FPO లో ప్రతీ రైతు…!!!

ఒక "ప్రైమరీ ప్రొడ్యూసర్" గా వ్యవహరిస్తాడు
ఒక "షేర్ హోల్డర్" గా వ్యవహరిస్తాడు.
తమ "బిజినెస్ వాటాను" కంపెనీలో జమ చేస్తాడు
కంపెనీ నుంచి వచ్చే స్థిర "రాబడులను/బోనస్" లను పొందుతాడు

FPO యొక్క కార్యవర్గం ఏర్పాటు :

300 మంది రైతులలో, 11 మంది పై స్థాయిలో ఒక బోర్డు లాగా ఏర్పడి, ఇందులో ఒకరు డైరెక్టర్ గా, ఛైర్మన్ గా, సెక్రటరీ గా, చీఫ్ ఏక్సిక్యూటివ్ గా, ఇతరులు మెంబర్లుగా ఉండి FPO యొక్క అన్నీ కార్యకలాపాలను చూసుకుంటారు. వీరందరిని ప్రతీ సంవత్సరం క్షేత్ర స్థాయిలో ఉండే ఇతర రైతు సభ్యులు ఎన్నుకుంటారు.

FPO ను రిజిష్ట్రేషన్ చేయు విధానం:

"కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ" (MoCA) వెబ్ సైట్ లో ఆన్ లైన్ పద్దతిన FPO ను రిజిష్ట్రేషన్ చేయాలి

STEP-1: FPO డైరెక్టర్ యొక్క డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ తీసుకోవాలి (DSC)

STEP-2: FPO డైరెక్టర్ గుర్తింపు నంబర్ తీసుకోవాలి (DIN)

STEP-3: FPO పేరు, చిరునామా, ఉద్యెశ్యం, రైతుల వివరాలు, షేర్స్ & పెట్టుబడి వివరాలతో కూడిన మెమొరండం ఆఫ్ అసోషియేషన్ (MoA) ను తయారు చేసుకోవాలి

STEP-4: ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యొక్క పూర్తి మార్గదర్శకాలు, ఇతర నిబందనలు & షరతులతో కూడిన ఆర్టికల్స్ ఆఫ్ అసోషియేషన్ (AoA) తయారు చేసుకోవాలి

STEP-5: FPO పేరును రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) లో మొదటగా రిజర్వేషన్ చేసుకోవాలి (ఫామ్ నం. INC-32 పార్ట్ A లో)

STEP-6: తరువాత సంబందిత రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) క్రింద FPO పేరును రిజిష్ట్రేషన్ చేయాలి (ఫామ్ నం. INC-32 పార్ట్ B లో), 

దీనికి క్రింది డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి;

            - RoC వారు జారీ చేసిన FPO రిజర్వేషన్ లెటర్
            - మెమొరండం ఆఫ్ అసోషియేషన్ (MoA)
            - ఆర్టికల్స్ ఆఫ్ అసోషియేషన్ (AoA)
            ఇన్కమ్ టాక్స్ పాన్ కార్డు
            కమర్షియల్ టాక్స్ టాన్ కార్డు
            - EPFO రిజిష్ట్రేషన్
            - ESIC రిజిష్ట్రేషన్
            బ్యాంక్ అకౌంట్ వివరాలు
            - GSTIN నంబర్

పై డాక్యుమెంట్స్ ను రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) వారు తనిఖీ చేసిన తరువాత, 30 రోజులలో FPO రిజిష్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది.

విధంగా ప్రారంభించిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPO's) కు ప్రధానమంత్రి కిసాన్ FPO యోజన పథకంక్రింద ఈ క్రింది ప్రయోజనాలు పొందుతారు

FPO స్థాపించిన 3 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చు కోసం 18 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.

ప్రతీ రైతు సభ్యునికి 2000/- వరకు ఈక్విటీ గ్రాంట్ ను మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో 15 లక్షల పరిమితి వరకు పొందుతారు.

క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ మద్దతు ఉంటుంది.

దీనితో పాటు పాటు ఒక సాదారణ కంపెనీకి పొందే ఇతర అన్నీ ప్రయోజనాలు FPO కు లభిస్తాయి.

నాబార్డు బ్యాంక్ నుంచి ప్రత్యేకమైన రుణ సదుపాయాలను పొందుతారు.

                                                                

రైతుముచ్చట, ఎడిటర్ డెస్క్

హైదరాబాద్

Post a Comment

2 Comments

  1. Excellent first hand information on FPOs, thanks for sharing

    ReplyDelete
  2. Useful information. Keep posting such more content regarding FPOs

    ReplyDelete