Breaking News
Loading...

సీడ్ మేళాకు సన్నదమవుతున్న జయశంకర్ అగ్రివర్సిటీ

రైతుముచ్చట, హైదరాబాద్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో, మే 24 న హైదరాబాద్ రాజేంద్రనగర్ లో “విత్తన మేళా” ను నిర్వహించేందుకు జయశంకర్ అగ్రివర్సిటీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేళాలో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలతో పాటు రాష్ట్ర స్థాయి వ్యవసాయ & విత్తన సంస్థలు పాల్గొననున్నాయి. అదే రోజు అగ్రివర్సిటీ పరధిలో ఉండే జగిత్యాల, వరంగల్, పాలెం వ్యవసాయ పరిశోధన స్థానాలు & కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా విత్తన మేళాను నిర్వహించనున్నారు.

ముఖ్యంగా ఈ విత్తన మేళాలో వివిధ పంటలలో జయశంకర్ అగ్రివర్సిటీ అభివృద్ది చేసిన వంగడాల యొక్క నాణ్యమైన విత్తనాలను & జీవన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా, కొత్త వంగడాల యొక్క ప్రత్యేకత & వాటి గుణగణాల పై అవగాహన మరియు ఇతరత్ర సందేహాలను రైతులు నివృత్తి చేసుకోవటానికి శాస్త్రవేత్తలతో ఇష్టా గోష్టి కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అగ్రివర్సిటీ, విత్తన పరిశోధన & సాంకేతిక పరిజ్ఞాన కేంద్ర డైరెక్టర్ తెలిపారు.

Post a Comment

0 Comments