Breaking News
Loading...

హైటెక్స్ లో భారీ కిసాన్ ఎక్స్పో

రైతుముచ్చట, హైదరాబాద్: గ్రామభారతి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని, హైదరాబాద్, హైటెక్స్ లో మే 21 & 22  తేదీలలో రెండు రోజుల పాటు “కిసాన్ ఎక్సిబిషన్” ను నిర్వహిస్తున్నట్లు గ్రామ భారతి కార్యదర్శి సామ ఎల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు, ఎక్సిబిషన్ లో ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థలకు చెందిన సేంద్రీయ ఉత్పత్తులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, వ్యవసాయ టెక్నాలజీలకు సంబందించిన స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అధెవిధంగా, ఆరోగ్యం, సేంద్రీయ & ప్రకృతి వ్యవసాయం, అమృత ఆహారం, ఆనందమైన జీవనం, విలువలతో కూడిన విద్య, గోమాత, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPO’s) మరియు సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయాలు గురించి ఎక్స్పో లో ప్రత్యేకంగా చర్చించనున్నారు.

Post a Comment

0 Comments