తెలంగాణ, రైతుముచ్చట:
తెలంగాణ రాష్ట్ర ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ కమీషనర్ వెంకట్ రామ్ రెడ్డి ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా అత్యాధునిక పద్ధతిలో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్, జామ, క్యాప్సికమ్, టమాట రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా అత్యధిక సాంధ్రతలో “సింగల్ లాడర్ ట్రెల్లిస్ పద్ధతిలో” పండ్ల మొక్కలను పెంచుతున్న విధానం గురించి
అడిగి తెలుసుకున్నారు.
సింగల్ లాడర్ ట్రెల్లిస్ పద్ధతి :
ఈ పద్ధతిలో వరుసకు వరుసకు మధ్య 8 ఫీట్ల వ్యత్యాసం మరియు ఒక్కో వరుసలో స్తంభాల మధ్య దూరం 30 ఫీట్లు వ్యత్యాసంతో స్తంభాలు ఏర్పాటు చేసుకుంటారు.ప్రతి స్తంభం భూమిలో 2 ఫీట్లు మరియు భూమి పైన 6 ఫీట్లు ఉంటుంది.
వీటిపై 3 వరుసలలో మొదటి వరుస 80 సెం.మీ. రెండవ వరుస 50 సెం.మీ. మరియు మూడవ వరుస 30 సెం.మీ. తీగలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి వరుసలో మొక్కకు మొక్కకు వ్యత్యాసం 8 ఫీట్లతో నాటుతారు. ప్రతి తీగకు రెండు శాఖలను పాకించడం జరుగుతుంది అనగా 6 శాఖలను మాత్రమే పెంచుతారు. ప్రతి శాఖ నుండి 5-6 షూటలు మాత్రమే ఉంచి మిగతా పూత తీయడం జరుగుతుంది. తద్వారా మొత్తం చెట్టు పై 25 నుంచి 30 కాయలను మాత్రమే పెంచుతారు.
ఈ విధంగా చేసుకున్నట్లు అయితే ప్రతి కాయ బరువు 750 గ్రా. నుండి 1.50 కేజీ వరకు వస్తుంది. మార్కెట్ లో ఒక్కో పండు ధర రూ.80 నుంచి 100 వరకు పలుకుతుంది. ఈ విధంగా ఎకరానికి 550 చెట్లకు గాను 550 x 30 x రూ.80/- దాదాపుగా రైతు ఎకరానికి 10 నుంచి 13 లక్షలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో జామ మరియు ఇతర పండ్ల చెట్లను కూడా పెంచవచ్చు.
0 Comments