Breaking News
Loading...

ఆఫ్రికా ఫుడ్ ఫ్రైజ్ కు ఎంపికైన ICRISAT

నైరోబీ, రైతుముచ్చట: హైదరాబాద్ లోని ప్రముఖ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అయిన ఇక్రీశాట్ ప్రతిష్టాత్మకమైన “ఆఫ్రికా ఫుడ్ ఫ్రైజ్” అవార్డ్ కు ఎంపికైంది. ఆఫ్రికా ఖండంలోని 13 దేశాలలో పలు పరిశోధనలు జరిపి ఆహార భద్రత పెంపునకై కృషి చేసినందుకు నైరోబీ లో జరిగిన ఆఫ్రికా గ్రీన్ రెవల్యూషన్ సమ్మిట్-2021 సంధర్భంగా ఈ అవార్డ్ ను అందజేయడం జరిగింది.

ఈ సంధర్భంగా ఇక్రీశాట్ డైరెక్టర్ జనరల్ డా. జాక్వెలైన్ హాగ్స్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇక్రీశాట్ పరిశోధన ఫలాలు అందించటం కోసం పరిశోధనలపై మరింత దృష్టి సాదిస్తున్నామని, ప్రతిష్టాత్మకమైన ఈ “ఆఫ్రికా ఫుడ్ ఫ్రైజ్” అవార్డ్ కు ఇక్రీశాట్ ఎంపికవటం ఎంతో గర్వంగా ఉందని, ఈ సంధర్భంగా ఇక్రీశాట్ శాస్త్రవేత్తలందరికి అభినందనలు తెలియజేశారు.

ముఖ్యంగా ఇక్రీశాట్ 2007 నుండి 2019 వరకు 266 రకాల లెగ్యూమ్ వెరైటీలను అభివృద్ది చేసి, 5 లక్షల క్వింటల్లా అలసంద, కంది, వేరుశనగ, శనగ, సోయాబీన్ విత్తనాలను ఆఫ్రికా దేశాలకు అందించి ఆహార భద్రతకై తోడ్పాటును అందించింది. 

అదేవిధంగా బుర్కినాఫాసో, ఘనా, మాలీ, నైజర్, నైజీరియా, సెనిగల్, ఇథియోపియా, కెన్యా, మలావి, మొజాంబిక్, టాంజానియా, ఉగాండా & జింబాంబే లాంటి  దేశాలలో “ట్రోపికల్ లెగ్యూమ్ ప్రాజెక్ట్” ను అమలుపరచి వర్షాధారం పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కొన్ని మిలియన్ల చిన్నసన్నకారు రైతుల అభ్యున్నతికి ఇక్రీశాట్ తోడ్పడింది.

Post a Comment

0 Comments