Breaking News
Loading...

ఇండియా నుంచి బియ్యం & గోధుమ ఎగుమతులపై కీలక విషయాలు వెల్లడించిన USDA

  • బియ్యం & గోధుమ ఎగుమతులపై కీలక విషయాలు వెల్లడి
  • అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య నివేదిక విడుదల చేసిన USDA
  • అత్యధిక స్థాయికి ఇండియా నుంచి బియ్యం & గోధుమ ఎగుమతులు 
  • ఇండియాలో నాణ్యమైన ధాన్యం ఉత్పత్తి 
  • ఇండియాలో ఎగుమతి చేయగల సమర్థవంతమైన సరఫరాధారులు 
  • సౌత్ ఈష్ట్ ఆసియా దేశాల నుండి ఎగుమతుల నిషేధం
  • యూరోపియన్ దేశాలలో తక్కువగా గోదుమల ఉత్పత్తి
  • చైనా పూర్తిగా గోదుమ దిగుమతులపై ఆధారపడుతుంది
  • భారత్ లో క్రొత్తగా డీప్ వాటర్ పోర్ట్ సౌకర్యాల ఏర్పాటు 
  • దీనితో ఈస్ట్ ఆఫ్రికా దేశాలకు అధిక ఎగుమతులకు సాధ్యం
  • ఇండియా యొక్క బియ్యం & గోదుమలకు అధిక డిమాండ్ 
  • తద్వారా అంతర్జాతీయంగా ఎగుమతి ధరలు పెరిగాయి

వాషింగ్టన్, రైతుముచ్చట: వరి, గోధుమలలో తగినంత దేశీయ సరఫరాలు, ఎగుమతులు చేయగల సమర్థవంతమైన పోటీదారులు మరియు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కలిగి ఉండటం వలన కొన్ని సంవత్సరాల నుండి ఇండియా నుంచి బియ్యం & గోధుమ ఎగుమతులు అత్యధిక స్థాయికి చేరుకుంటున్నాయని "అమెరికా సంయుక్త రాష్ట్రాల అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ (USDA)" వారు విడుదల చేసిన "అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య నివేదిక" తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఇండియా యొక్క బియ్యం & గోదుమ దిగుమతులకు అధిక డిమాండ్ సంతరించుకోవటంతో, ఎగుమతిదారుల ధాన్యం ధరలు అమాంతం పెరిగాయి. ఈ 2020-21 సంవత్సరంలో ఇండియా యొక్క బియ్యం ఎగుమతులు ఎక్కువ మొత్తంలో నమోదు కానున్నాయని, తద్వారా గతంలో అంతర్జాతీయ మార్కెట్ లో పోటీలేని ఇండియా ధరలు 2020-21 సంవత్సరానికి పోటీగా మారాయని, ఈ విధంగా ఇండియాలో పండుతున్న బియ్యం ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులలో ఆధిపత్యాన్ని చెలయిస్తూ వస్తుందని, గోధుమ & మొక్కజొన్న ఎగుమతులు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ లాంటి సమీప మార్కెట్లకు పరిమితవుతున్నాయని USDA వెల్లడించింది.

ఎన్నో సంవత్సరాలుగా ఇండియా బియ్యం & గోధుమ ఎగుమతులు చేస్తున్నా, ఇండియా లో నాణ్యమైన వరి ధాన్యం ఉత్పత్తి, ఎగుమతి చేయగల సంర్థవంతవంతమైన సరఫరా ధారులు ఉడటంతో పాటు సౌత్ ఈష్ట్ ఆసియా దేశాలలో ఎగుమతులు నిషేదించడం వలన గత ఏడాది కాలం నుండి ఎగుమతి మార్కెట్ విలువ పెరిగిందని, అంతేకాకుండా తూర్పు భారత దేశంలో క్రొత్తగా డీప్ వాటర్ పోర్ట్ సౌకర్యాలను నెలకొల్పడం నిరంతరంగా పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి తోడ్పడిందని USDA తెలిపింది.

దీనితో పాటు, యూరోపియన్ దేశాలలో తక్కువ గోదుమ ఉత్పత్తి ఉండటం, ఉక్రైయిన్ లో చిన్న పంటగా ఉండటం, రష్యాలోని ప్రభుత్వ విధానాల వలన మరియు ప్రపంచ అతిపెద్ద రెండవ దిగుమతిదారుగా (10.5 MT) ఉన్న చైనా నుండి గోదుమలకు డిమాండ్ పెరగటం వలన ఇండియా యొక్క గోదుమ ఎగుమతులకు కూడా మరింత లబ్ది చేకూరిందని USDA తెలిపింది.

Post a Comment

0 Comments