Breaking News
Loading...

మామిడి కొమ్మల కత్తిరింపులకు అనువైన సమయం

తెలంగాణ, రైతుముచ్చట: మామిడి కోత అనంతరం ఒక నెల రోజుల నిద్రావస్త తర్వాత చిందర వందరగా పెరిగిన కొమ్మలను, చీడపీడలు ఆశించి ఎండిపోయిన, ఒత్తుగా ఉన్న, నేల వాలిన, గొడుగు కొమ్మలను ఆగస్టు మాసంలో కత్తిరించాలి. పెద్ద కొమ్మలను పక్కకు తీసి ఆకులు కలిగిన చిన్న రెమ్మలను ఆచ్ఛాదనగా ఉపయోగించి వర్షం పడిన తరువాత పశువుల ఎరువులను, చల్లి, పూత రావడానికి ముందు తగిన చీడ పీడల నివారణకోసం తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తద్వారా శాఖీయ ఎదుగుదలను తగ్గించి, పూతకు ముందు చీడపీడలు పంట దశలో ఉదృతికి అవకాశం లేకుండా, తగిన పోషకాలను చెట్టు అంతర్గతంగా నింపుకొని తగిన సమయంలో దండిగా పూత వచ్చి మంచి దిగుబడి రావడానికి ఉపకరిస్తుంది.

Post a Comment

0 Comments