Breaking News
Loading...

జనగామ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతుల ఆసక్తి

జనగామ, రైతుముచ్చట: జనగామ జిల్లాలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (NFSM) స్కీమ్ క్రింద 2021-22 సంవత్సరానికి గాను 400 ఎకరాలలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యాన్ని విదించింది రాష్ట్ర ఉద్యాన శాఖ. ఆయితే అనుక్కున్న దాని కంటే ఎక్కువ మంది రైతులు ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపటంతో ఇప్పటికే 1073 ఎకరాలలో స్థానిక ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్లు జనగామ జిల్లా వ్యాప్తంగా రైతులను గుర్తించడం జరిగింది. ఇప్పటికే 72 ఎకరాల వరకు ప్లాంటేషన్లు పూర్తి అయిపోయాయి, మిగతా ఎకరాల ప్లాంటేషన్లకు సంబందించిన డ్రిప్ సర్వేలు పూర్తి అయ్యి, మొక్కలు కూడా రెడీగా ఉన్నాయని, మరో మూడు నెలల్లో జనగామ జిల్లాలో మిగతా ఆయిల్ పామ్ ప్లాంటేషన్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో జనగామ జిల్లా పర్యటన లో భాగంగా చిల్పూరు గ్రామము రైతు రాజాసదారం వ్యవసాయ పొలంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యాక్రమానికి రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్. వెంకట్ రామ్ రెడ్డి హాజరయ్యారు. తదనంతరం చిల్పూర్ మండలంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు పై రైతు అవగాహన కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. రైతులకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ రూపంలో మొక్కలను, డ్రిప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, అంతేకాకుండా ఆయిల్ పామ్ ను ప్రోత్సహించాలని ప్రత్యేక పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తున్నామని ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి అన్నారు.

Post a Comment

0 Comments