Breaking News
Loading...

ఉద్యాన పంటలలో తేనెటీగల పెంపకంతో మంచి ఫలితాలు

సూర్యాపేట, రైతుముచ్చట: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆగష్టు 18 నుండి 26 వరకు తేనెటీగల పెంపకంపై నిర్వహించనున్న శిక్షణ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన అధికారి బీ.శ్రీధర్, కేవీకే కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, కేవీకే హెడ్ & సీనియర్ శాస్త్రవేత్త బి.లవకుమార్ మరియు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి జిల్లాల నుండి 25 మంది రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

ఈ శిక్షణ కార్యాక్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రముఖులచే మరియు కేవీకే శాస్త్రవేత్తలచే తేనెటీగల పెంపకం, వ్యవసాయ & ఉద్యాన రంగాల్లో వాటి ప్రాముఖ్యత, తేనె తీసే విధానంపై క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ప్రాక్టికల్ సెషన్స్ కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలలో దిగుబడి పెరగాలంటే తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు & కేవీకే శాస్త్రవేత్తలు అన్నారు.

Post a Comment

0 Comments