Breaking News
Loading...

ఆయిల్ పామ్ సాగుపై కస్టమ్ డ్యూటీ దెబ్బ

రైతుముచ్చట, తెలంగాణ: ఇతర దేశాల నుండి పామాయిల్ దిగుమతులపై ఆదారపడుతున్న తరుణంలో రైతులు మంచి లాభాలు పొందేలా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని & వంట నూనె ఉత్పత్తులలో స్వయం సమృద్ది సాదించాలని దేశంలోని పలు రాష్ట్రాలు భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ మొలక విత్తనాల దిగుమతి సుంకాన్ని (కస్టమ్ డ్యూటీ) ఏకంగా 5% నుంచి 30% పెంచింది. తద్వారా ఆయిల్ పామ్ మొలక ధర పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. దీనితో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని భావించిన రాష్ట్రాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది, తెలంగాణ లాంటి రాష్ట్రాలు 8 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది.

సాదరణంగా ఆయిల్ పామ్ మొలక విత్తనాలను ఆయా రాష్ట్రాలు ఉద్యాన శాఖ, సంబందిత కార్పొరేషన్స్, కంపెనీల ద్వారా కోస్టారికా, మలేసియా & థాయిలాండ్ లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకోవటం జరుగుతుంది. 1992 నుండి 2019 వరకు ఆయిల్ పామ్ మొలక విత్తనాల దిగుమతి ITC HS 12099910 పండ్ల తోటల పద్దు కింద ఉండేది, కానీ ప్రస్తుతం దీనిని ITC HS 12071010 పామ్ నట్స్ పద్దు కిందకు మార్చారు. దీనిమూలంగా ఆయిల్ పామ్ మొలక విత్తనం 30 శాతం దిగుమతి సుంకం పరిధిలోకి వచ్చింది.

ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయిల్ పామ్ మొలకపై పెరిగిన అధనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయా, కార్పొరేషన్స్ భరిస్తాయా, కంపెనీలు భరిస్తాయా లేదా రైతులపై భారం మోపుతారా అనేది వేచి చూడాలి. ఒకవేళ రైతులపై భారం మోపితే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని అనుకున్న రాష్ట్రాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని దిగుమతి సుంకం పెంపునపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి.

Post a Comment

1 Comments