Breaking News
Loading...

నాణ్యమైన పూల & పండ్ల మొక్కలకు నిలయం మన “అగ్రి-హార్టి సొసైటీ”

హైదరాబాద్, రైతుముచ్చట: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం & ఉద్యాన రంగాలకు చెందిన వివిధ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు ఒక సమూహంగాగా ఏర్పడి "అగ్రి-హార్టి" అనే సొసైటీ ద్వారా కొన్ని సంవత్సరాలుగా పలు విశిష్ట సేవలు అందిస్తూ, ఆయా రంగాల అభివృద్దికి తమ వంతు కృషి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నాణ్యమైన పూల & పండ్ల మొక్కలను అందరికీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంగా వివిధ రకాల మామిడి, జామ, సపోటా, పనాస, రెగీ మరియు గులాబి, మందారం లాంటి పూల మొక్కలను హైదారాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో సరసమైన ధరలకే అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సంధర్భంగా మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అగ్రి-హార్టి సొసైటీ ఛైర్మన్ అనిల్ కుమార్ వెంకట్ మరియు సెక్రెటరీ డా. ఎ.వి రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

1 Comments