Breaking News
Loading...

ప్రమాదంలో 64% వ్యవసాయ భూమి


అంతర్జాతీయం, రైతుముచ్చట: వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా పురుగుమందుల వాడకం వలన ప్రపంచ పార్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ఊహించని ముప్పు తెచ్చిపెడుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నికి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన బృందం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 168 దేశాల్లో ఈ శాస్త్రవేత్తల బృందం విస్తృత పరిశోధనాత్మక ఆద్యాయనాన్ని నిర్వహించింది. అగ్రికల్చర్ కెమికల్స్ నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాల వలన ప్రపంచంలో 64 శాతం వ్యవసాయ భూమి ప్రమాదంలో పడిపోయిందని, ఇందులో 31 శాతం వ్యవసాయ భూమి హైరిస్క్ లో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆసియా ఖండంలో ముఖ్యంగా చైనా, ఇండియా, జపాన్, మలేసియా, ఫిల్లిపైన్స్ తదితర దేశాలలో వ్యవసాయ భూమి అతి ఎక్కువగా పురుగుమందుల కాలుష్య బారిన పడే ప్రమాదం ఉందని ఈ అద్యయనం ద్వారా వెల్లడైంది.

Post a Comment

0 Comments