Breaking News
Loading...

వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న టాప్ 10 దేశాలలో ఇండియా

న్యూఢిల్లీ, రైతుముచ్చట: 9 వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను సోమవారం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 19500 కోట్ల డబ్బును నేరుగా 9 కోట్ల 75 లక్షల మంది రైతు ఖాతాల్లోకి జమచేయడం జరిగింది. ఈ సంధర్భంగా ప్రధాని మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం లభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే ఆ తరుణంలో రాబోయే 2047 సంవత్సరంలో దేశ పరిస్థితిని నిర్ణయించడంలో మన దేశ వ్యవసాయం మరియు రైతుల పాత్ర అంత్యంత కీలకం కానున్నదని అన్నారు. అధెవిధంగా ప్రభుత్వ విజ్ఞప్తి ప్రకారం గడిచిన 6 సంవత్సరాలుగా రైతులు పప్పు ధాన్య పంటల విస్తీర్ణం & ఉత్పత్తి పెంచినందుకు దేశ రైతాంగానికి కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర మోడి. దేశం వంట నూనెలలో స్వయం సమృద్ది సాదించడం కోసం ఆయిల్ మిషన్ - ఆయిల్ పామ్ (NMEO-OP) అనే నినాదంతో 11 వేల కోట్ల పెట్టుబడిని పెట్టడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా దేశ చరిత్రలో తొలిసారిగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న టాప్ 10 దేశాలలో ఇండియా ఒకటిగా నిలిచిందని, ఈ సంధర్భంగా రైతులకు, సంబందిత అధికారులకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని వివిధ పాలసీల రూపకల్పన చేయడం జరుగుతుందని ప్రధాని అన్నారు.

Post a Comment

0 Comments