Breaking News
Loading...

ఆయిల్ పామ్ రైతులకు ప్రభుత్వ ప్రోత్సహకాలు

హైదరాబాద్, రైతుముచ్చట: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు జిల్లాలలో ఆయిల్ పామ్ సాగును కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఆయిల్ పామ్ సాగుకు సంబందించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

దాదాపు 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని 26 జిల్లాల్లో వివిధ ప్రాంతాలను కూడా గుర్తించి నోటిఫై చేసింది.

రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 30 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.

ఇదివరకు ఉన్న పరిమితులను సడలించి, డ్రిప్పు ద్వారా 12.50 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవటానికి రైతులకు అవకాశం కలిపించింది.

ఆయిల్ పామ్ వేసుకున్న రైతులకు ఇంతకముందు బింధు సేద్యం కానీ తుంపర సేద్యం పథకం పొంది ఉన్నపటికి, రెండవసారి ఏడు సంవత్సరాల కాలం పూర్తి అవ్వకపోయిన మరల బింధు సేద్యం ఇవ్వడానికి సడలింపు ఇచ్చింది.

ఇంతకుముందు ఇతర పంటకు బింధు సేద్యం పధకం ఉపయోగించినప్పటికి మరల డ్రిప్పు సౌకర్యం ఇవ్వడానికి సడలింపు ఇవ్వడం జరిగింది.

ఒక్క రైతుకు ఒక్కేచోట లేదా వేర్వేరు ప్రాంతంలో భూమి ఉన్నప్పటికి అదే సర్వేనెంబర్ లో అదే భూమిలో 12.50 ఎకరాలలో డ్రిప్పు సౌకర్యంతో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అవకాశం కల్పించింది.

బింధు సేద్యం ద్వారా ఆయిల్ పామ్ సాగు చేసె రైతులకు రాయితిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ పద్ధతి ద్వారా అందించనున్నది.

ఇదివరకు, ఒక హెక్టారుకు డ్రిప్ ఇన్స్టలేషన్ చేయడానికి యూనిట్ ధర 29030/- ఉండగా, దానిని రూ.42048/-కు పెంచడం జరిగింది.     

Post a Comment

1 Comments