Breaking News
Loading...

రైతు పొలంలోనే సోలార్ విద్యుత్త్ ఉత్పత్తి చేసుకొనుటకు సరికొత్త పథకం

న్యూఢిల్లీ, రైతుముచ్చట: గ్రామీణ ప్రజలకు స్థిరమైన & నిరంతర ఆదాయ వనరుగా ఉండి స్వయం ఉపాది కల్పించాలని, రైతుల కరెంటు కష్టాలను తీర్చి సోలార్ ప్యానెల్స్తో ఆర్ధిక ప్రగతిని సాదించాలని కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుం యోజన (PM Kusum Yojana) అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిందిఈ పథకం ద్వారా 2022 కల్లా 34 వేల కోట్ల పెట్టుబడి సహకారంతో దాదాపు 25 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్త్ ను  ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలలో ప్రభుత్వాల నిర్ణయం మేరకు ఈ పథకం అమలుకు డిస్కమ్స్/వ్యవసాయ శాఖ/మైనర్ ఇరిగేషన్ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.

పథకం ప్రకారం రైతు తన పొలంలో పంటలు పండించుకుంటూ కొంత స్థలంను సోలార్ కంపెనీలకు అద్దెకు ఇవ్వవచ్చు. పథకం ప్రయోజనాన్ని పొందాలంటే మొదటగా రైతు ఏదైన సంస్థతో ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది. ఒప్పందం సాధారణంగా 25 సంవత్సరాలు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ఇంటి పైకప్పు లేదా ఖాళీ స్థలంలో కూడా సౌర ఫలకాలను ఏర్పాటు చేయవచ్చు. ఇలా పొలంలో ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్త్ ను రైతు తన వ్యవసాయ కార్యాకలాపాలకు వాడుకోవటమే కాకుండా ఒప్పందం ప్రకారం సోలార్ కంపెనీలకు కూడా విద్యుత్ ను అమ్ముకోవచ్చు.

పథకం ప్రకారం....

పొలంలో మూడింట ఒక వంతు, సాగుకు ఆమోదయోగ్యం కానీ భూమిని సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి అద్దెకు ఇవ్వవచ్చు. ఇందుకోసం కంపెనీలు రైతుకు అద్దెను చెల్లిస్తాయి.

ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్త్ ను రైతులు తమ అవసరాలకు కూడా వాడుకోవచ్చు.

సోలార్ పంప్ సెట్ల వాడకం వలన పెద్ద మొత్తంలో రైతులపై డీజీల్ ఖర్చుల భారం తగ్గుతుంది

సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేయటానికి రైతు పెట్టుబడి పెట్టనవసరం లేదు, మొత్తం ఖర్చును ప్రైవేటు సంస్థ భరిస్తుంది.

పొలంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రైవేట్ కంపెనీలకు డిస్కౌంట్లు/రాయితీలను ఇస్తుంది.

ఈ విధంగా ఇది రైతుకు ఇది ఒక స్థిరమైన & నిరంతర ఆదాయ వనరుగా ఉండి, దాదాపు లక్షల రూపాయలను అదనంగా సంపాధించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఈ పథకం యొక్క పూర్తి వివరాల కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

https://mnre.gov.in/solar/schemes/

ఆన్ లైన్ రిజిస్థ్రేషన్ వివరాల కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

https://kusumyojana.info/index.html

Post a Comment

0 Comments