Breaking News
Loading...

సంప్రదాయ పంటలతో నష్టపోకుండా రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి


తెలంగాణ, రైతుముచ్చట: దేశ ప్రజల అవసరాలకు 22 మిలియన్ టన్నుల నూనె అవసరం ఉన్నా కేవలం 8 ఏడు మిలియన్ టన్నుల నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నాం. ఈ క్రమంలో మన దేశ అవసరాల కోసం 70 వేల కోట్ల పామాయిల్ ను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. ప్రస్తుతం దేశంలో 8 లక్షల ఎకరాలలో మాత్రమే పామాయిల్ సాగు చేస్తున్నాం, పామాయిల్ లో మనకు మనమే స్వయం సమృద్దిని సాదించాలంటే దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 80 లక్షల ఎకరాలకు పెంచవలసిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెగింజల సాగును ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణలో కూడా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పెంచాలనే ఉద్యెశంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అద్యక్షతన టీ శాట్ ద్వారా అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ గారు, ఆయిల్ ఫెడ్ జాయింట్ డైరెక్టర్ సరోజిని పాల్గొనడం జరిగింది.

ఈ సంధర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అన్నీ రకాల చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ఇందుకోసం అనేక ప్రోత్సకాలు ప్రకటించామని, సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి నిరణజన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో పండే ఆయిల్ పామ్ గెలలలో అధిక నూనె శాతం ఉన్నట్లు అనేక పరిశోధనా సంస్థలు తేల్చిచెప్పాయని,  టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.19 వేలు ధర పలుకుతుంది, ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడి వస్తుంది, ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ వద్ద పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే ఆయిల్ పామ్ సాగు విధానాన్ని రైతులు చూసేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరించి పర్యటనకు తీసుకువెళ్తుంది. తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ను సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని ఆయిల్ పామ్ సాగు విస్తరణపై టీ శాట్ లో జరిగిన అవగాహన కార్యాక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments