Breaking News
Loading...

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులను మోసం చేస్తున్న కేటుగాళ్ళు

హైదరాబాద్, రైతుముచ్చట: దేశంలో అగ్రికల్చర్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఎంతో మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ తరువాత పైచదువుల కోసం అగ్రికల్చర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. దీనితో ఇబ్బడిముబ్బడిగా దేశం మొత్తం మీద అగ్రికల్చర్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అయితే దేశంలో ప్రతీ సంవత్సరం ఔట్ గోయింగ్ అవుతున్న విద్యార్థులకు సరిపడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు అగ్రికల్చర్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆన్ లైన్ ఉద్యోగ వెబ్ సైట్ లలో నమోదు చేసుకున్న బయోడేటాలను సేకరించి, ఆన్ లైన్ ఇంటర్వ్యూలు చేసి మీకు ఉద్యోగం వచ్చిందని ఏకంగా కంపెనీ పేరుతోనే కాల్ చేసి డబ్బులు రాబడుతున్నారు.

ఇటీవలీ హైదరాబాద్ లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి, ఉత్తరప్రదేశ్ షీయాట్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో పీజీ చేసిన విద్యార్థిని నౌకరీ డాట్ కామ్ లో ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది. ఇదే అదనుగా ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి మేడమ్ మీకు హైదరాబాద్ లో పేరొందిన విత్తన కంపెనీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారని, విద్యార్థినిని ఫోన్ కాల్ లోనే ఇంటర్వ్యూ చేసి ఎంప్లాయ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 10 వేల రూపాయలను డిపాజిట్ చేయమని అన్నారు. వారిని నమ్మి 10 వేలు డిపాజిట్ చేసిన యువతికి ఆఫర్ లెటర్ పంపించి మరో 20 వేలు సెక్యూరిటీ డిపాసిట్ చేయమని అడగగా విద్యార్థినికి డౌట్ వచ్చి తన సహచరులతో ఈ విషయాన్ని చర్చించి, హైదారాబాద్ లో ఉన్న ఆ ప్రముఖ విత్తన కంపెనీకి చెందిన వారితో ఆరా తీయగా ఇదంతా మోసం అని తేలింది. ఈ విధంగా ఎవరైనా కాల్ చేసి, మీకు జాబ్ వచ్చిందని ఆన్ లైన్ ఇంటర్వ్యూ చేసి, డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పే కేటుగాళ్ల విషయంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

Post a Comment

0 Comments