Breaking News
Loading...

రైతు ఫర్టిలైజర్ కొనాలంటే ఆధార్ కార్డ్ & వేలి ముద్ర తప్పనిసరి

హైదరాబాద్, రైతుముచ్చట: దేశంలో రైతాంగానికి ఎలాంటి సమస్యలు, అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వంఫర్టీలైజర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్” (DBT in Fertilizers) పద్దతిని తీసుకొచ్చింది. పద్దతి ద్వారా ఎరువుల తయారీ కర్మాగారం నుంచి రైతు కొనే వరకు జరిగే ఎరువుల పంపిణీ ప్రక్రియ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ పద్దతిన జరుగుతుంది. కరోనాను దృష్టిలో ఉంచుకొని గతంలో కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికి ఇక నుంచి ఈ పద్దతిని డీలర్లు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ పద్దతిలో...!!! 

ప్రతీ డీలర్ షాప్ లో పాయింట్ ఆఫ్ సేల్ (PoS) పరికరాలను అందుబాటులో ఉంచారు. రైతు తమ ఆధార్ కార్డు తీసుకవచ్చి PoS పరికరంలో వేలి ముద్ర వేసి, ఆన్ లైన్ లో ఎంట్రీ చేసిన తరువాతనే ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. దీనితో ఇష్టారాజ్యంగా జరిపే ఎరువుల అమ్మకాలకు అడ్డుకట్ట వేయటం జరుగుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2 లక్షల 26 వేల PoS పరికరాలను అందుబాటులోకి తీసుకరావటం జరిగింది.

అంతేకాకుండా, రైతులు కూడా ఎక్కువ మొత్తంలో చేసే కొనుగోళ్లను నియంత్రించడానికి జిల్లాల వారీగా ఎక్కువ ఎరువులు కొనుగోలు చేసిన టాప్ 20 మంది రైతులను మరియు తరచుగా ఎరువులను కొనుగోలు చేసే రైతుల జాబితాను తీసి మరలా వ్యవసాయ అధికారి చేత క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి దృవీకరించడం జరుగుతుంది.

రైతు ఫర్టిలైజర్ కొన్న తరువాత తన మొబైల్ కి బిల్ నంబర్, డీలర్ పేరు, ఎంత కొన్నారు, అమౌంట్, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వివరాలు SMS రూపంలో వెళ్తాయి.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, రాష్ట్ర వ్యవసాయ శాఖలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ ఫెడరేషన్, ఫర్టిలైజర్ కంపెనీలు DBT లో ప్రత్యేకమైన డాష్ బోర్డ్స్ ను కలిగి ఉంటాయి. ఇందులో ఆయా శాఖలు, విభాగాలు, కంపెనీలు ఎప్పటికప్పుడు తమ వద్ద ఉండే స్టాక్స్, సరఫరా మరియు అమ్మకాలను అప్డేట్ చేస్తుంటాయి.

తద్వారా, ఓడరేవుల దగ్గర, ఫర్టిలైజర్ కంపెనీల వద్ద, రాష్ట్రాలలో, జిల్లా స్థాయిలలో, డీలర్ స్థాయిలో ఎరువుల లభ్యత ఎంత ఉంది అనే ప్రక్రియను భారత ప్రభుత్వ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ సులభంగా పర్యవేక్షిస్తుంది.

అంతేకాకుండా వచ్చే పంట కాలానికి ఉండే ఎరువుల అవసరాన్ని ముందే సూచిస్తుంది. దీనివలన ఎంత మొత్తం మన దేశంలో ఎరువులను తయారీ చేయవలసి ఉంటుంది, ఇతర దేశాల నుండి ఎంత దిగుమతి చేసుకోవలసి ఉంటుంది అనేది అంచనా వేసి ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది.

అదేవిధంగా,  డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ పద్దతిలో వచ్చిన సేల్స్ రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వం ఇస్తున్న ఎరువుల సబ్సిడీ డబ్బును నేరుగా కంపెనీల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. 

Post a Comment

0 Comments