Breaking News
Loading...

సేంద్రీయ దృవీకరణ & మార్కెటింగ్ పై రెండు రోజుల ఆన్ లైన్ కోర్సు

హైదరాబాద్, రైతుముచ్చట: సేంద్రియ సాగు చేస్తున్న రైతన్నలకు తాము పండించిన సేంద్రీయ ఉత్పత్తులను ఎలా దృవీకరణ చేయించుకోవాలి & వాటిని ఏ విధంగా, ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయంలో సాదారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో "సేంద్రీయ దృవీకరణ మరియు సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్" సంబందించిన వాణిజ్య వ్యవహారాలపై ఔత్సాహికులకు శాస్త్ర & సాంకేతిక పరమైన అవగాహన కల్పించడానికి సుస్థిర వ్యవసాయ కేంద్రం (CSA) అనుబంధ సంస్థ అయిన గ్రామీణ అకాడమీ ఆధ్వర్యంలో "జూలై 23 నుండి 24" వరకు రెండు రోజుల పాటు జూమ్ ఆప్ ద్వారా ఆన్ లైన్ కోర్సు ను నిర్వహించబోతుంది. ఈ కోర్సు ఫీజు రూ.1500 కాగా, వీటికి సంబందించిన రిజిష్ట్రేషన్ ప్రక్రియ గ్రామీణ అకాడమీ వెబ్ సైట్ లో జరుగుతుంది.

రిజిష్ట్రేషన్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి:

https://grameenacademy.in/courses/organic-certification/?fbclid=IwAR05-wqV7r4-zYJplwNowQGw1OmmukAmGdKW5Fbkm-1KAWOx38RlTEww5A0

Post a Comment

0 Comments