Breaking News
Loading...

సహకార సంఘాల అభివృద్దే లక్ష్యంగా ప్రత్యేక “సహకార మంత్రిత్వ శాఖ” ఏర్పాటు

న్యూఢిల్లీ, రైతుముచ్చట: భారత వ్యవసాయ, సహకార & రైతు సంక్షేమ శాఖ (DAC&FW) రెండుగా విభజన చెంది వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖగా (DA&FW) మరియు సహకార శాఖలుగా (DoC) ఏర్పడ్డాయి. దేశంలో సహకార సంఘాల అభివృద్దే లక్ష్యంగా వ్యవసాయ శాఖను ఈ విధంగా రెండు భాగాలుగా విభజించి జూలై 2021 లో ఒక ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను (Ministry of Cooperation) ఏర్పాటు చేసి, ఈ శాఖ బాద్యతలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ మంత్రిత్వ శాఖ దేశంలో కోఆపరేటివ్ మూమెంట్ ను మరింత బలోపేతం చేయడానికి పరిపాలన పరమైన, చట్ట పరమైన విధి, విధానాలను అందిస్తుంది. అంతేకాకుండా కోఆపరేటివ్ సొసైటీలకు వ్యాపారం చేయటంలో సులభతరం (Ease of Doing Business) సౌకర్యాలను కల్పించి, ఇతర రాష్ట్రాలలో కూడా తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ (MSCS) ఏర్పాటు చేయటం జరుగుతుంది.

ఇండియా లాంటి వ్యవసాయ ఆధారిత దేశంలో క్షేత్ర స్థాయిలో ఉండే రైతులు గ్రూపులుగా ఏర్పడి, అందరూ కలిసి ఒకే లక్ష్యంతో, తమకు అందుబాటులో ఉన్న వనరులను, మౌలిక వసతులను సమకూర్చుకొని వ్యవసాయ, ఉద్యాన, పాడి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, తమ వ్యాపార కార్యాకలాపాలను కొనసాగించే కోఆపరేటివ్స్ ఎన్నో ఉన్నాయి. దేశంలో రైతులు తాము పండిస్తున్న పంటలను, ఉత్పత్తులను సక్రమంగా ప్రాసెసింగ్ & మార్కెటింగ్ చేసుకొని మంచి లాభాలను ఆర్జించడంలో ఇలాంటి సహకార సంఘాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయి. 

మన దేశంలో 2019-20 సంవత్సర లెక్కల ప్రకారం 1,94,195 మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు & 330 సుగర్ మిల్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. దీనితో పాటు 2019-20 నాబార్డు లెక్కల ప్రకారం వ్యవసాయ రుణ సదుపాయాలకు సంబందించిన 95,238 ప్రాథమిక వ్యవసాయ గ్రామీణ బ్యాంకులు (PACS), 363 జిల్లా సహకార బ్యాంకులు (DCCB), 33 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రామీణ, జిల్లా, స్థాయిలలో ఉండే ఈ సహకార బ్యాంకులు అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒక ప్రత్యేక కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం వలన సహకార సంఘాల అభివృద్దికి మరింత లబ్ది చేకూరనున్నది.

Post a Comment

1 Comments