Breaking News
Loading...

ఈ సారి రికార్డు స్థాయిలో ఉద్యాన పంటల ఉత్పత్తి నమోదు

న్యూడిల్లీ, రైతుముచ్చట
: భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవలి విడుదల చేసిన రెండవ ముందస్తు అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2020-21 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 329.86 మిలియన్ టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత సంవత్సర ఉద్యాన పంటల ఉత్పత్తితో పోలిస్తే, 9.39 మిలియన్ టన్నులు అధికంగా, 2.93% వృద్ది రేటుతో, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు మరియు ఔషద పంటలలో అధిక ఉత్పత్తి సాదించడం జరిగింది. ఇదిలా ఉండగా పూల ఉత్పత్తి & మార్కెటింగ్ పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండి, గత సంవత్సరంతో పోలిస్తే 7.17% తక్కువగా పూల ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరం కూరగాయల ఉత్పత్తి 188.28 మిలియన్ టన్నులు ఉండగా, సారి 4.42% పెరుగుదలతో 196.27 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరగబోయే అవకాశం ఉందని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది
.

Post a Comment

0 Comments