Breaking News
Loading...

పంటల ఉత్పత్తిని పెంచే అఫోర్డబుల్ సెన్సార్ ను కనుగొన్న నాసా శాస్త్రవేత్త

నాసిక్, రైతుముచ్చట: దేశానికి వెన్నముకగా ఉన్న రైతన్న శ్రేయస్సు కోసం అధునాతన టెక్నాలజీలని అందుబాటులోకి తీసుకరావాలనే ధృడ సంకల్పంతో పరాగ్ నర్వేకర్ అనే నాసా రెటైర్డ్ శాస్త్రవేత్త వ్యవసాయంలో పంటల ఉత్పత్తిని పెంచటం కోసం “అఫోర్డబుల్ సెన్సార్” కనుగొన్నారు. ఈ ఒక్క సెన్సార్ ధర లక్ష యాబై వేలు కాగా, రైతులకు కేవలం 10 వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకరానున్నాడు. ఈ సెన్సార్లు పంటకు అవసారాన్ని బట్టి ఎప్పుడు, ఎంత మోతాదులో ఇరిగేషన్ ఇవ్వాలి, ఎంత ఫర్టిలైజర్ అందించాలి, ఇతర పోషకాల లభ్యత, పెస్టిసైడ్ స్ప్రే లాంటి సమాచారాన్ని రైతుకు ఇస్తుంది. అమెరికా, యూరప్ లాంటి దేశాలలో మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఉత్పత్తిని పెంచే ఇలాంటి కొత్త టెక్నాలజీలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయాని, NASA లో పనిచేసి రెటైర్డ్ అయిన తరువాత ఇండియాలో అలాంటి కొత్త టెక్నాలజీలను తీసుకరావలని అనుకున్నాని, గత మూడు సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్నాని, ఈ అఫోర్డబుల్ సెన్సార్ ను పూర్తిగా అందుబాటులోకి తీసుకరవటానికి మరి కొంత సమయం పడుతుందని పరాగ్ నర్వేకర్ తెలిపారు.

Post a Comment

0 Comments