Breaking News
Loading...

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్

కృష్ణా జిల్లా, రైతుముచ్చట:  ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న వైవిద్యమైన, సరికొత్త ఉద్యానవన పంట డ్రాగన్ ఫ్రూట్, తెలుగు రాష్ట్రాలలో వీటి సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తేలటంతో రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయుటకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ జిల్లా వీసన్నపేటకు చెందిన వెల్ది కుశాల్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒక ఎకరం పొలంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టి మంచి లాభాలు పొందుతున్నాడు.

2014 లో బీటెక్ పూర్తి చేసిన వెల్ది కుశాల్, ఆ తరువాత ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకున్నా, చిన్నప్పటి నుండి వ్యవసాయంపై ఆసక్తితో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని ఆలోచనతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటాన్ని ఎంచుకున్నాడు. 2018 లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ కు రిజైన్ చేసిన కుశాల్ గుజరాత్ వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ సాగుపై అవగాహన పెంచుకున్నాడు. తరువాత 2019 లో వియాత్నం నుంచి రెడ్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను తెప్పించుకొని ఎకరం పొలంలో సాగు చేశాడు.

రైతు అనుభవం:

అన్నీ రకాల నెలలు అనుకూలం ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలం, పగటి ఉష్ణోగ్రత 20 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది, ఇది తీగ జాతి మొక్క, దీని జీవిత కాలం 20 నుండి 25 సంవత్సరాలు ఉంటుంది, కనుక శాశ్వత నిర్మాణాలు సిమెంట్ పోల్స్ పై రింగ్ ఏర్పాటు చేసి పెంచవలసి ఉంటుంది. ఒక ఏకరాకు 500 పోల్స్ అవసరం అవుతాయి, ఒక్కొక పోల్ కి 4 మొక్కలు, మొత్తం 2 వేల మొక్కలు ఎకరాకు సరిపోతాయి.  8 అడుగుల ఎత్తైన స్తంభం, రెండు అడుగులు భూమి లోపల, ఆరు అడుగులు భూమి పైన పాత వలసి ఉంటుంది.

ఈ పంట సాగుకు పశువుల ఎరువును, వర్మికంపోష్ట్ అందిస్తున్నాని, సాదరణంగా, ఈ పంట సాగుకు ఎక్కువ నీరు అవసరం ఉండదని, నాటిన ఆరవ నెల నుండి ఈ పంటలో పూత ప్రారంభం అవుతుందని తెలిపాడు. పూత దశ నుండి 50 నుంచి 55 రోజుల తరువాత కాయలు చేతికి వస్తాయని. ఎకరానికి 6 లక్షల పెట్టుబడి పెట్టానని, ఇప్పటికీ 600 కాయల దిగుబడి వచ్చిందని, ఒక్కొక కాయ 60 రూపాయలకు అమ్ముకున్నానని, జూన్ నుండి అక్టోబర్ వరకు కాయ కాపుకు వస్తుందని, దాదాపు ఇంకా 20 వేల కాయ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొంత పొలంలో లోనే సాగు చేస్తున్నాని మున్ముందు వచ్చే ఫలితాలను బట్టి సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటాని వెల్ది కుశాల్ తెలిపారు.

Post a Comment

0 Comments