Breaking News
Loading...

ఏకలవ్య ఫౌండేషన్ లో అగ్రి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

అగ్రిజాబ్ అలర్ట్, రైతు ముచ్చట: హైదరాబాద్ లో ప్రముఖ వ్యవసాయ NGO అయిన ఏకలవ్య ఫౌండేషన్ లో వికారాబాద్, సిద్దిపేట్, మెదక్ జిల్లాలలో పనిచేయుటకు తాత్కాలిక ప్రాతిపాదికన FPO లకు సంబందించిన 16 కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ గాని లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులు అర్హులు. సాలరీ 15 వేల నుంచి 20 వేల వరకు ఉండగా, ఈ పోస్టులను రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు అప్లికేషన్ ఫామ్ మరియు సంబందిత డాక్యుమెంట్స్ ని info@ekalavya.net మెయిల్ ఐడీకి జూలై 20 లోపు పంపించగలరు.

Post a Comment

3 Comments