Breaking News
Loading...

APEDA మరియు NAFED మద్య కుదిరిన అవగాహన ఒప్పందం

 

రైతుముచ్చట, న్యూఢిల్లీ: ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడంలో భాగంగా ఎగుమతి దారులకు, సహకార సంఘాలకు సహకారం అందించాలనే ఉద్యెశంతో జాతీయ వ్యవసాయం ఉత్పత్తుల ఎగుమతి సంస్థ (APEDA) మరియు జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED) మధ్య కీలక ఒప్పందం జరిగింది.

అవగాహన ఒప్పందం ప్రకారం, APEDA క్రింద రిజిస్టర్డ్ అయిన ఎగుమతిదారులకు నాఫెడ్ ద్వారా అమలు చేయబడుతున్న అన్ని ప్రభుత్వ పథకాల క్రింద సహకారం అందించబడుతుంది.

అంతేకాకుండా ఎగుమతులకు సంబందించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం జరుగుతుంది

అంతర్జాతీయ వాణిజ్యంలో రైతు సహకార సంఘాలను భాగస్వామ్యం చేయడంలో భాగంగా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబోయే బి2బి & బి2సి ఫెయిర్లలో రైతు సహకార సంఘాలు పాల్గొనడానికి మరియు అంతర్జాతీయ వ్యాపార అభివృద్ధి పెంపొందించడానికి దోహదపడుతుంది

అదేవిధంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కుఆపరేటివ్ సొసైటీలు & స్వయం సాధికారక గ్రూపుల(SHGs) నైపుణ్యాన్ని పెంపొందించడంలో భాగంగా పలు శిక్షణ అవగాహన కార్యక్రమాలను  కూడా APEDA మరియు NAFED వారు సంయుక్తంగా నిర్వహించనున్నారు.

Post a Comment

0 Comments