Breaking News
Loading...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాలలో అయిల్ పామ్ సాగుకు ప్రణాళికలు

సిరిసిల్ల, రైతుముచ్చట: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహిస్తున్న అయిల్ పామ్ సాగులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల అయిల్ పామ్ సాగు చేయాలని తెలంగాణ ఉద్యాన శాఖ లక్ష్యాన్ని విదించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ అధికారులు దీనికి అనుగుణంగా తగిన ప్రణాళిక రూపొందించి ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. పంట కొనుగోలు కోసం FGV-PU ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తెలంగాణ ఉద్యాన శాఖ కేటాయించడం జరిగింది. ఈ కంపెనీ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రైతుల నుండి ఆయిల్ పామ్ ను కొంటుంది. కంపెనీ కొనుగోలు చేసిన తరువాత రైతు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది.

రైతులకు ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ, సిరిసిల్ల వారి సూచనలు :

వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయాలి

ఆయిల్ పామ్ పంట ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది

ఆయిల్ పామ్ నాటిన నాల్గవ సంవత్సరం నుంచి దిగుబడి మొదలవుతుంది

మొదటి మూడు సంవత్సరాలు అల్లం, పసుపు, కూరగాయల లాంటి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు

ఒక ఎకరంలో 50 మొక్కలు (9X9 మీ) నాటుకోవచ్చు

ఎకరాకు సంవత్సరానికి 12 నుంచి 14 టన్నుల దిగుబడి వస్తుంది

ప్రస్తుతం టన్నుకి రూ.19,114/- ధర పలుకుతుంది

ఎకరాకు సంవత్సరానికి దాదాపు 2,67,596 ఆదాయం పొందవచ్చు

Post a Comment

0 Comments