Breaking News
Loading...

ఆయిల్ పామ్ రైతులకు మూడేండ్లలో ఎకరాకు 36 వేల పెట్టుబడి సాయం


హైదరాబాద్, రైతుముచ్చట: దేశంలో పామాయిల్ ప్రొడక్షన్ తక్కువగా ఉండి, ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల నుండి చేసుకునే దిగుమతులపై ఆదారపడుతున్న తరుణంలో, దేశవ్యాప్తంగా పామాయిల్ కు సంతరించుకుంటున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్ద మొత్తంలో ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో భాగంగా ప్రతీ రైతుకు ఎకరాకు మొదటి సంవత్సరం 26 వేలు. తరువాతి రెండు సంవత్సరాలలో సంవత్సరానికి 5 వేల చొప్పున మొత్తం 36 వేల పంట పెట్టుబడి ప్రోత్సాహక సాయాన్ని ప్రకటించింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా ఇదివరకే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో భాగంగా డ్రిప్ ఇరిగేషన్ పై పలు నిబందనలను సడలించడమే కాకుండా ఒక హెక్టారుకు డ్రిప్ ఇనిష్టలేషన్ చేయడానికి యూనిట్ ధరను 42,048/- పెంచింది.

Post a Comment

1 Comments