Breaking News
Loading...

33 జిల్లాలకు 33 అగ్రి ప్రొడక్ట్స్ ఎంపిక

న్యూఢిల్లీ, రైతుముచ్చట: దేశవ్యాప్తంగా చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల (Micro Enterprises) అభివృద్దే లక్ష్యంతో "మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ క్రమబద్దీకరణ పథకం (PMFME)" క్రింద కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ఒక జిల్లాఒక ఉత్పత్తి (One District-One Product) అనే విధానాన్ని తీసుకవచ్చింది. ఇందుకోసం 10 వేల కోట్ల రూపాయలను కేటాయించి 2025 వరకు 2 లక్షల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అభివృద్ది చేయాలని లక్ష్యంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 707 జిల్లాలలొ డిమాండ్ ఉన్న 707 రకాల ప్రధాన వ్యవసాయ & అనుబంధ రంగాల తాజా ఉత్పత్తులను ఎంపిక చేసి ఆయా జిల్లాలలో ఇదివరకే నెలకొని ఉన్న లేదా కొత్తగా నెలకొల్పాలని అనుకున్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వివిధ రకాలుగా ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. తద్వారా రైతులు తాము పండిస్తున్న పంట ఉత్పత్తులకు డిమాండ్ నెలకొని, వారి ప్రాంతాలలోనే ఎప్పటికప్పుడు సరైన గిట్టుబాటు ధరకు అమ్ముడపోయి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వేలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపాది అవకాశాలు లభిస్తాయి.

ODOP విధానంలో భాగంగా తెలంగాణలో 33 జిల్లాలకు సంబందించి 33 డిమాండ్ ఉన్న ప్రధాన వ్యవసాయ & దాని అనుబంధ రంగాల ఉత్పత్తులను ఎంపిక చేసి, తెలంగాణలో పథకం అమలుకు ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్, అకిల్ కుమార్ గవార్ ను నోడల్ అధికారిగా నియమించింది కేంద్ర ప్రభుత్వం.

స్కీమ్ వలన కలిగే ప్రయోజనాలు :

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి అయ్యే ఖర్చులో 35% సబ్సిడీ తో 10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తుంది

వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాలు (FPO’s), స్వయం ప్రాయోజిత గ్రూపులు (SHG’s) & సహకార సంఘాలకు ప్రాథమిక పెట్టుబడి సహకారంతో పాటు 35% క్రెడిట్ గ్రాంట్ ను కూడా ఇస్తుంది.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించడానికి ప్రాథమిక పెట్టుబడి కోసం ప్రతీ స్వయం ప్రాయోజిత గ్రూపుకు (SHG’s) 40 వేల రూపాయల ప్రాథమిక పెట్టుబడి సాయం అందించబడుతుంది

ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ యొక్క బ్రాండింగ్ & మార్కెటింగ్ కొరకు అయ్యే ఖర్చులో 50% పెట్టుబడి సహకారాన్ని అందించబడుతుంది.

ఈ పథకం పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

https://drive.google.com/file/d/1Wtf3Mp00QdLIn8z8jtHPh4VFpQx57yek/view?usp=sharing


ఆన్ లైన్ రిజిస్థ్రేషన్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.

https://pmfme.mofpi.gov.in/pmfme/#/Login


ఇతర వివరాల కోసం నోడల్ ఏజెన్సీ & తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి వెబ్ సైట్ ను సంప్రదించండి

https://tsfps.outshade.com/

Post a Comment

0 Comments