Breaking News
Loading...

రైతులకు అందుబాటులో “TS సీడ్స్” విత్తనాలు

తెలంగాణ, రైతుముచ్చట : వానాకాలం పంటల సాగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1345 సెంటర్లలో దాదాపు 6,00,000 క్వింటాళ్ళ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ (TSSDC) రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇందులో 4,28,732 క్వింటాళ్ళ వరి, 9 వేల క్వింటాళ్ళ వేరుశనగ, 2 వేల క్వింటాళ్ళ కంది, 2400 క్వింటాళ్ళ పెసర్లు, 2500 క్వింటాళ్ళ మినుములు, 240 క్వింటాళ్ళ నువ్వులు, లక్ష 60 వేల క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తనాలను సంస్థ యొక్క మార్కెటింగ్ సెంటర్లలలోTS సీడ్స్” అనే బ్రాండ్ పేరుతో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల రైతులు విత్తనాభివృద్ది సంస్థ యొక్క జిల్లా స్థాయి కార్యాలయాలను సంప్రదించి విత్తనాలను పొందవచ్చు.

అందుబాటులో ఉన్న "TS సీడ్స్" విత్తనాలు:

వరి :

BPT-5204 , తెలంగాణ సోనా , MTU-1010 , MTU-1061MTU-7029, MTU-1001 

JGL-24423JGL-18047KNM-118 , WGL-44WGL-347 

వేరుశనగ:

K-6 

పెసర్లు:

MGG-295 

మినుములు:

PU-31 

కంది:

ICPL-87119 & WRG-65 

నువ్వులు :

శ్వేత & JCH 1020

ఇతర వివరాల కోసం రైతులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

రంగా రెడ్డి - 9849908758

మహబూబ్ నగర్ - 9849908753

నిజామాబాద్ - 9849908755

అదిలాబాద్ - 9849908756

కరీంనగర్ - 9849908754

వరంగల్ - 9849908759

ఖమ్మం - 9849908760

నల్గొండ - 9849908757

మెదక్ - 8374038877

Post a Comment

0 Comments