Breaking News
Loading...

పప్పు ధాన్యాల సాగుపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢీల్లీ, రైతుముచ్చట: దేశవ్యాప్తంగా నిత్యవసరాల ధరలు అమాంతం పెరుగుతుండడంతో ధరలకు కళ్ళెం వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాలను ప్రత్యామ్నాయ పంటల కింద పరిగణించి విస్తీర్ణాన్ని పెంచాలని అన్నీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021-22 లో 2.50 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలను పండించాలని రాష్ట్రాలకు టార్గెట్ గా పెట్టింది. వీటిలో తెలంగాణలో వానాకాలంలో పండే కంది, పెసర, మినుములతో పాటు ఇతర పప్పు ధాన్యపు పంటలు కలిపి 3.67 లక్షల టన్నులు కాగా, యాసంగిలో శనగను 2.32 లక్షల టన్నులు పండించాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2021-22 లో ఎంత మేర పప్పు ధాన్యాల సాగు అవుతుందో వేచి చూడాల్సిందే.

Post a Comment

0 Comments