Breaking News
Loading...

సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రారంభోత్సవం


సిద్దిపేట, రైతు ముచ్చట : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యంగా పలు జిల్లాల్లో అభివృద్ధి & అవగాహన కార్యక్రమాలను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం రోజు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా నంగునూరు లో ఆయిల్ సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయాన్ని ఇచ్చే, మల్బరీ, ఆయిల్ పామ్ లాంటి కమర్షియల్ క్రాప్స్ ను కూడా సాగు చేయాలని  మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం లో భాగంగా రైతులకు ఆయిల్ పామ్ మొక్కలను, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని సబ్సిడీ కింద అందిస్తున్నామని తెలిపారు. సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 160 మంది రైతులను గుర్తించి, జూన్ & జూలై నెలలో 1000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సంవత్సరం చివరాఖరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరో 5000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చెపట్టాలనే లక్ష్యంగా ఉన్నామని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు.

Post a Comment

0 Comments