Breaking News
Loading...

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తన రంగానికి దక్కిన అరుదైన గుర్తింపు

 

హైదరాబాద్, రైతుముచ్చట: రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిద్దిద్దే క్రమంలో, జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో క్రియాశీలంగా ఉంటూ వివిధ విత్తన రంగ అభివృద్ది కార్యాక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని FAO గుర్తించడం జరిగింది. శాస్త్ర సాంకేతిక & విధాన పరమైన అంశాలలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే విత్తన ప్రముఖులచే శాస్త్ర సాంకేతిక సలహా మండలి” ఏర్పాటుకు FAO శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డా. కేశవులును ఈ మండలి మెంబర్ గా ఎంపిక చేస్తునట్లు FAO డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బెత్ బెక్దోల్ తెలిపారు. ప్రపంచంలో ఆహార భద్రత లోపించిన దేశాలలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచి, సమగ్ర వ్యవసాయ & విత్తన పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా, పంట రకాల అభివృద్ది, విడుదల, నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన నాణ్యత భరోసా విధానం, విత్తన వాణిజ్యం, విత్తన చట్టాలు, విత్తన పరీక్ష పద్దతులు & ప్రమాణాలపై కూలంకషంగా చర్చించి, FAO కు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ఈ శాస్త్ర సాంకేతిక సలహా మండలి కీలకంగా వ్యవహరించనున్నది. ఈ నేపథ్యంలో FAO శాస్త్ర సాంకేతిక సలహా మండలిమెంబర్ తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డా. కేశవులు ఎంపికవటం తెలంగాణ విత్తన రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందని, ఇది తెలంగాణ విత్తన పరిశ్రమ మరింత అభివృద్ది చెందడానికి ఎంతగానో దోహదపడుతుందని, వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు.

Post a Comment

0 Comments