Breaking News
Loading...

రైతులకు అందుబాటులో నాణ్యమైన విత్తనాలు - పాలెం, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు

నాగర్ కర్నూల్, రైతు ముచ్చట: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం నందు వరి, కంది, ఆముదం మరియు జొన్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు. మరో వారం రోజుల్లో వర్షాలు పడే సూచన ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి నాణ్యమైన దృవీకరణ విత్తనాలను పొందగలరని తెలిపారు.

అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు :

  1. వరి రకం- ఆర్.ఎన్.ఆర్-15048 (తెలంగాణ సోన, సన్న రకం)
  2. కంది రకం- పి.ఆర్.జి-176 (ఉజ్వల)
  3. ఆముదం రకం - పి.సి. హెచ్-111(హైబ్రిడ్)
  4. జొన్న రకాలు - సి.ఎస్.వి-41 మరియు  పి.వయ్.పి.ఎస్-2
ధరలు:
30 కిలోల వరి బస్తా: 1320/- రూపాయలు
3 కిలోల కంది రకం బస్తా: 390/- రూపాయలు
2 కిలోల ఆముదం బస్తా: 500/- రూపాయలు
మరిన్ని వివరాలకు ఈ క్రింద ఇవ్వబడిన శాస్త్రవేత్తల ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు.
వరి- శ్రీ.ఎం. పరిమళ్ కుమార్ - 9948589387
       డా. కె. శ్రీధర్ - 9948735896
ఆముదం-డా. కె. సదయ్య - 8885331799
జొన్న- డా. ఎస్. మహేశ్వరమ్మ - 9492278817
కంది- శ్రీమతి. జి. నీలిమ - 9970402856

Post a Comment

4 Comments

  1. రైతులందరూ యసంగిలో ఒకే పంట వైపు వెళ్తున్నారు.
    ఈ తరుణంలో రైతులకు 10-15క్విటాళ్లు పండే పప్పు జాతి ధాన్యాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

    ReplyDelete
  2. సర్.. పచ్చజొన్న రకం PSPY2 ధర కిలో కి ఎంత ఉంటుంది..

    ReplyDelete
    Replies
    1. Contact డా. ఎస్. మహేశ్వరమ్మ - 9492278817

      Delete