Breaking News
Loading...

అగ్రీ డిప్లొమా కోర్సుల అర్హతలలో కీలక సడలింపులు

హైదరాబాద్, రైతుముచ్చట: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న అగ్రికల్చర్, ఆగ్రీ ఇంజనీరింగ్ మరియు ఆర్గానిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు అర్హతలలో సడలింపులు చేస్తూ ఇటీవలి జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ డా. సుధీర్ కుమార్ తెలిపారు. డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నాలుగేళ్ల పాటు తప్పక గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి అనే గత నిబంధనను సడలించి, ఇక మీదట 60 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులు, 40 శాతం గ్రామీణ, అర్బన్ విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. అయితే నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాలలో చదివిన విద్యార్థులు మాత్రమే గ్రామీణ కోటాకు అర్హులు కానున్నారు. అధెవిధంగా గతంలో పదవ తరగతి పాస్ అయిన వారు మాత్రమే డిప్లొమా కోర్సులలో చేరేందుకు అర్హులు కాగా, ఇక మీదట ఇంటర్ చదివిన విద్యార్థులు పాలిసెట్ లో ర్యాంకులు పొంది మెరిట్ సాదిస్తే డిప్లొమాలో ప్రవేశాలకు అర్హులుగా ప్రకటించారు. అయితే వయో నిబంధనలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేధు. 15 సంవత్సరాలు పూర్తి అయి 22 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. పాలిసెట్ - 2021 ర్యాంకుల ఆధారంగా జయశంకర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాపాలిటెక్నిక్ లలో అగ్రికల్చర్, ఆగ్రి ఇంజనీరింగ్, ఆర్గానిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.

Post a Comment

1 Comments