Breaking News
Loading...

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై డీజీపీ వీడియో కాన్ఫెరెన్స్

 

హైదరాబాద్, రైతు ముచ్చట: వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ అదేశాల మేరకు అప్రమత్తమైన వ్యవసాయ మరియు పోలీస్ శాఖలు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరాను నియంత్రించడంలో భాగంగా తీసుకోవలసిన చర్యలపై మంగళవారం రోజు లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీస్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి & డీజీపీ మహేందర్ రెడ్డి అద్యక్షతన అన్నీ జిల్లాల వ్యవసాయ అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, రైతు బంధు సమితి అద్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోలీస్ శాఖ ఐజీలు, విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశవులు మరియు వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీములు అప్రమత్తంగా ఉండి, విత్తన గోదాములు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లు, విత్తన దుకాణాలు, రవాణా ప్రదేశాలు మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు, ఎవరైనా నకిలీ విత్తనాలు తయారు చేసిన, రైతులకు అమ్మిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని పీడీ ఆక్ట్ పెడతామని తెలిపారు.

Post a Comment

0 Comments