Breaking News
Loading...

ముమ్మరంగా విత్తన టాస్క్ ఫోర్స్ తనిఖీలు-47 కేసులు, 81 అరెస్టులు, 4 కోట్ల విలువైన 718 క్వింటాల్లు సీజ్


హైదరాబాద్, రైతు ముచ్చట : గత నాలుగు రోజులుగా రాష్ట్రం మొత్తం వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన దృవీకరణ అధికారులు మరియు పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ తనిఖీలలో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్న 47 మందిపై IPC-420 కింద కేసులు నమోదు చేసి, 81 మందిని అరెస్ట్ చేసి, దాదాపు 4 కోట్ల విలువైన, 239 క్వింటాల్ల నకిలీ పత్తి విత్తనాలను మరియు 479 క్వింటాల్ల ఇతర పంటల విత్తనాలను సీజ్ చేసి, అనుమానాస్పదంగా ఉన్న17,891 క్వింటాల్ల విత్తనాల అమ్మకాలను ఆపివేసి, తమ ఆదీనంలోకి తీసుకోవటం జరిగింది. నకిలీలలో ముఖ్యంగా HT పత్తి విత్తనాలు, గడువు లోపించిన విత్తనాలు మరియు అనధికారమైన, నిరాధారమైన విత్తనాలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాల, ఆసిఫాబాద్, గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అధిక మొత్తంలో నకిలీ పత్తి, మక్క, వరి మరియు HT పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఖమ్మం, నాగర్ కర్నూల్, నారాయణపేట్, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అనధికారమైన మిరప విత్తనాలు పట్టుబడ్డాయి.

Post a Comment

0 Comments