Breaking News
Loading...

TSSOCA ద్వారా సేంద్రీయ దృవీకరణ సేవలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారి  ప్రోత్సాహంతో తెలంగాణలో సేంద్రీయ రైతులకు తోడ్పాటును అందించి, సేంద్రీయ వ్యవసాయంను లాభసాటిగా చేయుటకు 2016 లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తి ధ్రువీకరణ అథారిటీ కు కూడా భారత ప్రభుత్వం APEDA చే గుర్తింపు లభించి మిగతా రాష్ట్రాలు మరియు ఇతర ధ్రువీకరణ సంస్థలతో పోలిస్తే, అతి తక్కువ ధరకే సేంద్రీయ దృవీకరణ సేవలను రైతులకు అందించడం జరుగుతుంది.  ఎకరాకు కేవలం  రూ.1860/- కి మాత్రమే మొదలుకొని 25 ఎకరాల వరకు రూ. 2100/- ధ్రువీకరణ పొందుటకు రుసుము చెల్లించవలసి ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రంలోనైనా పండించిన/తయారుచేసిన సేంద్రీయ ఉత్పత్తులను అయిన ద్రువీకరించే అధికారం సంస్థకు ఉంటుంది.

సేంద్రీయ  ధ్రువీకరణ చేయు పద్దతి :

సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, రైతు గ్రూపులు మరియు ఉత్పత్తిదారులు సంస్థకి తగిన రుసుము చెల్లించి సంస్థ వద్ద నమోదు చేసుకోవలెను

వ్యవసాయ ఉత్పత్తిదారులు, కూరగాయల  ఉత్పత్తిదారులు పంట వేసిన 30 రోజులలోనేసంస్థ వద్ద పేరు నమోదు చేసుకోవాలి

పండ్ల ఉత్పత్తిదారులు పంట వేసిన ఆరు నెలల తరువాత నమోదు చేసుకోవాలి

రైతు సేంద్రియ క్షేత్రమును నమోదు చేసుకొనుటకు ముందు ధ్రువీకరణ సంస్థ అధికారులు క్షేత్రమునకు సంబంధించినటువంటి అన్ని పత్రాలను పరిశీలన చేయడం జరుగుతుంది

ఇట్టి నమోదు చేయబడిన క్షేత్రమును సంస్థ అధికారులు రైతుకు ముందస్తుగా సమాచారం ఇచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది

తనిఖీ పూర్తి అయిన తరువాత నమోదు చేయబడిన క్షేత్రము మరియు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించిన వివరాలను తనిఖీ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది

తనిఖీ సంఖ్య ఎన్ని చేయాలి అనే నిబంధన లేదు కానీ పరిస్థితిని బట్టి ఎన్ని తనిఖీలైన  చేయవచ్చు, ముందస్తు సమాచారం లేకుండా కూడా తనిఖీ చేయవచ్చు

ధ్రువీకరణ అధికారి ఇచ్చిన రిపోర్టుని నిశితంగా మూల్యాంకనం చేయడం జరుగుతుంది

ఏదైనా సేంద్రియ  ధ్రువీకరణకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే సరిదిద్దుకునే అవకాశం ఉత్పత్తిదారులకు ఇస్తుంది. అది సరి చేయకపోతే సంస్థ ధ్రువీకరణ చేయుట నిరాకరిస్తుంది.

సంస్థ నిరాకరణ నిర్ణయాన్ని ఉత్పత్తిదారులు అప్పీలు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు

విధంగా తనిఖీ మరియు మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తరువాత పంటకి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుంది

సంస్థ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలకు ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఏదైనా క్షేత్రము పూర్తిగా సేంద్రియంగా మారాలంటే మూడు సంవత్సరములు వ్యవధి పడుతుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో ప్రతి సంవత్సరం క్షేత్రానికి కన్వర్షన్ సర్టిఫికెట్ ను కూడా జారీ చేయబడుతుంది. సేంద్రియ ఉత్పత్తులలో రసాయన అవశేషాలను తెలుసుకొనుటకు మట్టినమూనాలు, ఆకులు లేదా ఇతర వృక్ష సంబంధిత భాగాల ను సేకరించి జాతీయ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్ష చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రుసుములు ఉత్పత్తిదారులు చెల్లించవలెను.

Post a Comment

0 Comments