Breaking News
Loading...

దేశంలో మొట్టమొదటి సారిగా సీడ్ ట్రేసబిలిటీని ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్రం

 

వ్యవసాయం యొక్క సుస్థిరమైన వృద్ధికి విత్తనం అత్యంత కీలకమైన ఉత్పాదకం  అయినందున, సీడ్ ట్రెసబిలిటీ వ్యవస్థను అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం భారత విత్తన పరిశ్రమ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరుగుదల అనేది రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాల లభ్యత మరియు సరఫరాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

అతిపెద్ద సవాలుగా-విత్తన జాడ కనుగొనటం :

గత కొన్నేళ్లుగా, ఆధునిక ప్రపంచంలో ఐటి సాంకేతిక పరిజ్ఞానం రావడం మరియు విత్తనాల నాణ్యతపై అవగాహన పెరగడంతో, విత్తనోత్పత్తి మరియు మార్కెటింగ్ స్థాయిలో నాణ్యమైన విత్తనాలను గుర్తించడంలో భాగంగా విత్తన జాడను కనిపెట్టడం ఒక ప్రధాన సమస్యగా మారింది.

దేశంలో నకిలీ విత్తనాల ఉత్పత్తి & సరఫరాను అరికట్టడానికి విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, గోదాములు, మార్కెటింగ్ మొదలైన అన్ని దశలలో అనేక విత్తన చట్టాలను అమలుపరుస్తున్నపటికి, విత్తన చట్టాలను అమలుపరుస్తున్న సంస్థలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నపట్టికీ, రైతులు క్షేత్రస్థాయిలో ఇంకా యథార్థమైన & నాణ్యమైన విత్తనాన్ని గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని నకిలీ విత్తన కంపెనీలు/ఫ్లై-బై నైట్ ఆపరేటర్లు విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్ మొదలైన వాటిలో అవకతవకలను పాల్పడి, మార్కెట్ లో నకిలీ విత్తనాలను అమ్ముతూ, రైతులను మోసం చేయటమే కాకుండా విత్తన వ్యాపారంలో ఆరోగ్యకరమైన పోటీకి అంతరాయం కలిగించి విత్తన పరిశ్రమ అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నారు.

నేపథ్యంలో, 2019 లో భారత ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శి, అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా, భారత దేశంలో కూడా ఒక పటిష్టమైన విత్తన జాడను గుర్తించే విధానం ద్వారా  రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా చేయాలని ప్రకటించింది. అయితే, జాతీయ స్థాయిలో వివిధ కారణాల వల్ల సీడ్ ట్రెసబిలిటీ విధానం తీసుకరావటం ఆలస్యమవుతూ వచ్చింది.

సీడ్ ట్రేసబిలిటీ లో ముందడుగు వేసిన తెలంగాణ రాష్ట్రం :

దేశంలో సీడ్ ట్రెసబిలిటీ విధానం తీసుకరావలని, భారత వ్యవసాయ శాఖ ప్రకటించిన నాటి నుంచి, తెలంగాణ రాష్ట్రంలో విత్తన జాడ గుర్తింపు వ్యవస్థను అభివృద్ది చేయడానికి తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. కేశవులు కింద పనిచేయటం జరుగుతుంది. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి, గత కొన్ని నెలల నుండి తెలంగాణ ప్రభుత్వం విత్తన జాడ అభివృద్ధికి కృషి చేస్తోంది, ప్రభుత్వ విభాగాలతో మరియు విత్తన కంపెనీలతో పలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. నిరంతరంగా పటిష్టమైన పరీక్షలతో సమర్థవంతమైన విత్తన జాడను కనుగునే వ్యవస్థను అభివృద్ధి చేసి, విత్తన దృవీకరణ సంస్థలో మరియు  విత్తనాభివృద్ది సంస్థలో అమలుకు సిద్దంగా ఉంది. ఇది దేశంలో మొట్టమొదటిదే కాకుండా, ఒక  మోడల్ సీడ్ ట్రేసబిలిటీ వ్యవస్థగా ఉండి, నకిలీ విత్తనాలను నియంత్రించి, ఇతర రాష్ట్రాలు మరియు మొత్తం దేశానికి ఆదర్శంగా నిలువనున్నది.

            తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విత్తనం, తెలంగాణ యొక్క అవసరాలను తీర్చడంతో పాటు సుమారు 10 ఇతర రాష్ట్రాలకు కూడా దృవీకరణ విత్తనం సరఫరా చేయబడుతోంది, కాబట్టి వాణిజ్య పరిమాణo మరింత మెరుగుపడి, తెలంగాణ నుండి సరఫరా చేయబడిన విత్తనాలకు ఇది ఒక ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ లో విత్తన ట్రేసిబిలిటీ అనేది ట్రేడింగ్ మరియు విశ్వసనీయతకు అదనపు విలువగా ఉంటుంది.

Post a Comment

0 Comments