Breaking News
Loading...

సేంద్రీయ ఉత్పత్తుల విలువను పెంచే దృవీకరణ సర్టిఫికెట్స్

హైదారాబాద్, రైతుముచ్చట: ఆదునిక రంగంలో అధిక దిగుబదులు సాదించాలి అనే లక్ష్యంగా, వ్యవసాయంలో విచ్చల విడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వలన, రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆశించిన దిగుబడులు సాదించలేకపోతున్నారు. అంతేకాకుండా రసాయనాల అవశేషాలు తినే ఆహారంలోనే కాకుండా, చుట్టూ ఉన్న వనరులలో పేరుకుపోయి మనుష్యులకు, ఇతర ప్రాణులకు  మరియు వాతావరణానికి కూడా తీరని నష్టాల్ని కలిగిస్తున్నాయి.  వ్యవసాయంలో ఇట్టి సమస్యలను గుర్తించిన వివిధ దేశాలు సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇదే సమయంలో ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగా ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందుల రసాయనాల అవశేషాలు లేని సేంద్రియ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, బయటి మార్కెట్ లో ఎక్కువ ధరలకు సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేయటం జరుగుతుంది. నేపథ్యంలో చాలా మంది రైతులు ఆసక్తితో సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నపట్టికి వారు పండించిన సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ లో సరైన నాణ్యతా గుర్తింపు విధానం లేకపోవటం వలన వినియోగదారుడికి రైతు పండించిన సేంద్రీయ ఉత్పత్తులపైన సరైన నమ్మకం లేకుండా పోయింది.

ఇదే క్రమంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని, దళారులు మార్కెట్ లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో వినియోగదారులను మోసం చేస్తూ విపరీతంగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. విధంగా గతంలో వినియోగదారుడు ఎలాంటి అనుమానాలు లేకుండా తాను కొనే సేంద్రీయ ఉత్పత్తులు నాణ్యమైనవియా..కావా.? అని నిర్దారించుకోకుండా కొనుగోలు చేసేవారు, కానీ కాలక్రమేణా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తుల పట్ల వస్తున్న అవగాహన వల్ల సేంద్రీయ ఉత్పత్తుల నిర్దారణ విషయంలో వాటిని అమ్మేవారిని ప్రశ్నిచడం జరుగుతుంది.

నేపథ్యంలో మార్కెట్ లో సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగులు మరియు వాటి నాణ్యతా విషయంలో సరైన ప్రమాణాలు & పద్దతి ప్రకారం ప్రజలకు నమ్మకం కలిగేలా సేంద్రీయ ఉత్పత్తులను దృవీకరించి వినియోదారులకు అందుబాటులో ఉంచాలని, భారత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ (APEDA) ఆధ్వర్యంలో నిర్దేశించిన NPOP ప్రమాణాల ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ సంస్థలకు సేంద్రీయ దృవీకరణ చేయుటకు గుర్తింపు అనుమతులు ఇవ్వటం జరిగింది.

విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారి  ప్రోత్సాహంతో తెలంగాణలో సేంద్రీయ రైతులకు తోడ్పాటును అందించి, సేంద్రీయ వ్యవసాయంను లాభసాటిగా చేయుటకు 2016 లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తి ధ్రువీకరణ అథారిటీ కు కూడా భారత ప్రభుత్వం APEDA చే గుర్తింపు లభించి మిగతా రాష్ట్రాలు మరియు ఇతర ధ్రువీకరణ సంస్థలతో పోలిస్తే, అతి తక్కువ ధరకే సేంద్రీయ దృవీకరణ సేవలను రైతులకు అందించడం జరుగుతుంది.  ఎకరాకు కేవలం  రూ.1860/- కి మాత్రమే మొదలుకొని 25 ఎకరాల వరకు రూ. 2100/- ధ్రువీకరణ పొందుటకు రుసుము చెల్లించవలసి ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రంలోనైనా పండించిన/తయారుచేసిన సేంద్రీయ ఉత్పత్తులను అయిన ద్రువీకరించే అధికారం సంస్థకు ఉంటుంది.

Post a Comment

0 Comments