Breaking News
Loading...

తెలంగాణలో ముమ్మరంగా టాస్క్ ఫోర్స్ విత్తన తనిఖీలు


రాష్ట్రంలో నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన వారిపై విత్తన చట్టం, 1966 ,విత్తన కంట్రోల్ ఆర్డర్  1983 ,పర్యావరణ చట్టం 1986, ఎసెన్షియల్ కమాడిటీ ఆక్ట్ 1955 ప్రకారం చట్టపరంగా నేరంగా పరిగణించి చర్యలు తీసుకోవటం జరుగుతుంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం నాసిరకం విత్తనాల సరఫరాకు అడ్డుకట్ట వేయాలని ఈ క్రింది చర్యలు తీసుకోవటం జరిగింది.:

1.    అనుమానం ఉన్న ప్రదేశాలలో సాంపుల్స్ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

2.   వ్యవసాయ శాఖ అధికారులు ,విత్తన ధృవీకరణ అధికారులు ,పోలీస్ శాఖ వారితో సంయుక్తంగా రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.

3.   మార్చి 2018 లో పత్తి లో నాసిరకం విత్తహనలు మరియు HT పత్తి విత్తనాలు వ్యాప్తి ని నిరోధించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.

ప్రభుత్వ అద్దేశాల ప్రకారం మార్చి, 2018 నుంచి రాష్ట్రం లో వివిధ జిల్లాలలో టాస్క్ ఫోర్సు టీములు తనిఖీలు చేపట్టడం జరిగింది.

·        332 లక్షల విలువ గల  4283 కిలోల గడువు లోపించిన విడి HT పత్తి విత్తనాలను సీజ్ చేయటం జరిగింది.

·        9.83  కోట్ల విలువ గల  6317  కిలోల నాసిరకం పత్తి విత్తనాలని సీజ్ చేయటం జరిగింది.

·       తనిఖీలలో  31 మందిని అరెస్టు చేసి, ఆరుగురిపై  IPC 420 ప్రకారం కేసులు బుక్ చేయటం జరిగింది.

·        రాష్ట్రం లో ఇప్పటి వరకు 1613 తనిఖీలు చేపట్టటం జరిగింది.

·        కొందరికి షోకాజు నోటీసులు కూడా జారి చేయటం జరిగింది.

4.   భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం HT  పత్తి విత్తనాలు నియంత్రణ చేయడానికి జిల్లా అధికారులకు సూచనలు ఇవ్వటం జరిగింది.

5.   మార్కెట్లో నాసిరకం పత్తి విత్తనాల సరఫరాను నియంత్రించడానికి నియమ నిభందనలు తయారు చేసి జిల్లా వ్యవసాయ అధికారులకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ నియమ నిబంధనలు అన్ని రాష్ట్రాలలో ఒకేరకంగా అనుసరించడానికి భారత ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది.

6.   రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశ్యంతో దీశంలో మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం నాసిరకం విత్తన సరఫరా చేస్తున్న వారిపై పేదీ ఆక్ట్ ప్రయోగించడం జరిగింది.

Post a Comment

0 Comments