Breaking News
Loading...

దేశానికి యూరోపియన్ విత్తన సమాన అధికారాలు తీసుకొచ్చే బాద్యతలను తెలంగాణకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

 


ప్రపంచం మొత్తంలో OECD భాగస్వామ్య దేశాల సమూహo మరియు ఐరోపా దేశాల సామూహం చాలా పెద్దవి. ఈ దేశాలకు విత్తన ఎగుమతులు చేయాలంటే ఆయా దేశాల విత్తన ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు చేయాలని అనుకుంటున్న దేశాలలో విత్తనోత్పత్తి మరియు విత్తన పరీక్ష జరిగి ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని 2008 లోనే మన దేశం OECD భాగస్వామ్య దేశంగా చేరింది. ఇలా అంతర్జాతీయ విత్తన దృవీకరణ (OECD) పద్దతి ద్వారా OECD భాగస్వామ్య దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తూ వస్తుంది. అయితే యూరోపియన్ దేశాలకు కూడా విత్తన ఎగుమతులు చేయాలంటే ఐరోపా దేశాల విత్తన ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష జరగాలి. ఇలా భారత దేశ విత్తన ప్రమాణాలను అంతర్జాతీయ విత్తన ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచి, యూరోపియన్ విత్తన సమాన అధికారాలు సాదించి మన దేశం నుంచి ఐరోపా దేశాలకు కూడా విత్తన ఎగుమతులను ప్రోస్థహించడంలో ఒక ముందడుగు వేసింది.

ఇండియాకు యూరోపియన్ విత్తన సమాన అధికారాలు సాదించడానికి నోడల్ ఆఫీసర్ గా డా. కేశవులు :

గత ఏడాది తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థల డైరెక్టర్ డా. కేశవులును ఇండియాకు యూరోపియన్ సమాన అధికారాలు సాదించడానికి నోడల్ అధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అప్పటి నుండి ఆయన నేతృత్వంలో భారత విత్తన చట్టం, విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష పద్దతులు, ప్రమాణాలు, పంట రకాల నమోదు, విడుదల పద్దతులను మెరుగు పరచి వాటి గురించి క్లుప్తంగా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి 2018 సెప్టెంబర్ లో యూరోపియన్ విత్తన సమాన అధికారాల కోసం యూరోపియన్ కమీఃసన్ కు భారత ప్రభుత్వం ద్వారా దరఖాస్తు పంపించారు.

అనoతరం ఆయన ఆద్వర్యంలో హైదారాబాద్ లో అంటే దక్షిణ ఆసియా లోనే తొలి సారిగా అంతర్జాతీయ ISTA విత్తన సదస్సు జరిగింది. అంతే కాదు స్విట్జర్ లాండ్ లో ఉన్న అంతర్జాతీయ విత్తన ప్రమాణాల సంస్థ (ISTA) ఉపాద్యక్షలుగా దా. కేశవులు ఎంపిక అయ్యారు. ముఖ్యంగా ఈ సదస్సు హైదారాబాద్ లో విజవంతంగా నిర్వహించి తెలంగాణ విత్తన రంగ కీర్తి ని ప్రపంచ నలుమూలలా విస్తరింప  చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అనంతరం ఆయన ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు పర్యటించి తెలంగాన విత్తనాల గొప్పదనం, నాణ్యతను వివరించడంలో మన రాష్ట్రం అంతర్జాతీయంగా విత్తన రంగంలో గుర్తింపుకు నోచుకుంది. ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు మన విత్తనాలను ఐరోపా దేశాలు ఎగుమతి చేసుకునే స్థాయి కి తీసుకవచ్చారు. మన దేశం నుంచి అందులోనూ మన తెలంగాణ నుంచి ఎక్కువ విత్తనాలు ఎగుమతి కానున్నాయి.

క్షేత్ర స్థాయి విశ్లేషణ మరియు ఐరోపా విత్తన సమాన అధికారాల సాదన:

అనంతరం యూరోపియన్ కమీషన్ ఈ దరఖాస్తును స్వీకరిస్తూ చట్టపరమైన ప్రాథమిక విశ్లేషణను పూర్తి చేసి క్షేత్ర స్థాయిలో విత్తనోత్పత్తి, విత్తన ప్రమాణాల అమలు తీరుపై ఐర్లాండ్ లో ఉన్న యూరోపియన్ కమీషన్, ఆరోగ్య, భద్రత విభాగం డీజి నాoడోర్ పేటే ఇండియాకు వచ్చి వెళ్లారు. ఆయన మన వద్ద ప్రాధానంగా విత్తన చట్టం అమలుతీరు ను పరిశీలించారు. అనంతరం ఐరోపా దేశాలకు మన విత్తనాల ఎగుమతికి పచ్చ జెండా ఊపడంతో ప్రపంచంలోనే మన రాష్ట్రం ఒక విత్తన హబ్ గా మారే  దిశాగా అడుగులు పడ్డటైంది.

ఐరోపా దేశాలకు విత్తన ఎగుమతికి మార్గం సుమగం:

ఐరోపా దేశాలకు ఈ ఏడాది నుంచి మన రాష్ట్ర విత్తనాలు సరఫరా కానున్నాయి. ఐరోపా దేశాల విత్తన ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణలో విత్తనోత్పత్తి జరగడం వలన మన రాష్ట్రం నుంచి ఐరోపా దేశాలకు మన విత్తనాల ఎగుమతికి మార్గం సుగమం అయింది. దీంతో మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా విత్తన రంగంలో ఒక ముందడుగు వేసింది. దేశంలోనే విత్తన భాండాగారంగా వెలుగొందాలన్న లక్ష్యంతో తెలంగాణ ఆవిర్భావం నుంచి అడుగులు వేస్తున్న మన రాష్ట్రం ఇందులో కీలక భూమిక పోషించింది. యూరోపియన్ యూనియన్ తో సమాన విత్తన అధికారాలు సాదించే దిశగా మన రాష్ట్రాన్ని అంటే మన దేశాన్నే ముందుకు తీసుకవెళ్తుంది.

Post a Comment

0 Comments