Breaking News
Loading...

తెలంగాణలో కల్తీ విత్తనాల నియంత్రణకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకరానున్న తెలంగాణ ప్రభుత్వం

 


హైదారాబాద్, రైతు ముచ్చట : తెలంగాణలో వ్యవసాయ శాఖ, విత్తన దృవీకరణ అధికారులు & పోలీస్ డిపార్ట్ మెంట్ వారిచే టాస్క్ ఫోర్స్ టీములను ఏర్పాటు చేసి, రైతులకు కల్తీ విత్తనాలను అంటగడుతున్న వారిపై ఇప్పటికే పీడీ ఆక్ట్ ఉపయోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. దేశంలో ఇప్పటికే అమలులో ఉన్న విత్తన చట్టం-1966 ప్రకారం ఉన్న నిబందలను అనుసరించి చర్యలు తీసుకుకుంటున్నప్పటికి, తెలంగాణ రాష్ట్రంలో కల్తీ విత్తనాల తయారీ, సరఫరాను నియంత్రించి, నిబందనలను మరింత కఠినతరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే సి‌ఎం కేసీఆర్ సంబందిత ఐ‌ఏ‌ఎస్ అధికారులు, వ్యవసాయశాఖ & విత్తన సంస్థల అధికారులతో కట్టుదిట్టమైన నిబందనల తయారీ మరియు విత్తన చట్టంలో మార్పులకు సంబందించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ప్రత్యేకమైన సీడ్ రెగ్యులేటరీ అథారటీని ఏర్పరచి, సీడ్ లైసెన్సింగ్, విత్తనోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ లలో నిబందనలను మరింత కఠినతరం చేసీ అవసమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకరావలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

Post a Comment

0 Comments