Breaking News
Loading...

నోరూరించే మధురఫలం-కొల్లాపూర్ మామిడి

  • కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక డిమాండ్
  • సురభి రాజుల హయాంలోనే తోటల పెంపకం
  • నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఎకరాలలో మామిడి తోటలు

నాగర్ కర్నూల్, రైతు ముచ్చట: నోరూరించే మామిడి పళ్ల ఉత్పత్తికి నిలయం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం. ఆ నాటి సంస్థానాదీశులైన సురభివంశస్థులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రుచికరమైన, మేలురకమైన వంగడాలను తెచ్చి ఈ ప్రాంతంలో తోటలను పెంచారు. తదనంతరం ఇక్కడి మామిడి రైతులు వేలాది ఎకరాలలో మామిడి సాగు చేయడం జరుగుతుంది, రాను రాను కొల్లాపూర్ మామిడికి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని సాదారణ పంటల సాగుకు ఉపయోగించే భూములను కూడా మామిడి తోటల పెంపకానికి మారుస్తున్నారు.  ముఖ్యంగా కొల్లాపూర్ నియోజక వర్గంలో మంచి ఫ్రూట్ క్వాలిటీకి సరిపడా వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా మామిడి తోటల పెంపకంలో శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన రైతులు ఉండటం వలన, ఇక్కడ పండించే పండ్లు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచాయి. కొల్లాపూర్ పండే బెనీశాన్ మామిడి రకం హైదారాబాద్, ముంబై, డిల్లీ లలో ఎంతో డిమాండ్ ఉంది.  అయితే ఈ సంవత్సరం మంచి దిగుబదులు వచ్చినప్పటికి హైదారాబాద్ మార్కెట్ మంచి ధర పలకట్లేదని, వచ్చే సంవత్సరం నుంచి  రైతుకు లాభం చేకూరేలా మద్య ధళారి వ్యవస్థ లేకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యాపారులకు సంబందించిన కొనుగోలు కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేస్తే మరింత లాభధాయకంగా ఉంటుందని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.

Post a Comment

0 Comments