Breaking News
Loading...

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన సేంద్రీయ సాగు విస్తీర్ణం

అంతర్జాతీయం, రైతుముచ్చట: గడించిన 2020 సంవత్సరం వరకు ప్రపంచ వ్యాప్తంగా 72.3 మిలియన్ హెక్టార్లకు సేంద్రీయ సాగు విస్తీర్ణం పెరిగిందని అంతర్జాతీయ సేంద్రీయ వ్యవసాయ పరిశోధన సంస్థ-IFOAM ప్రకటనలో తెలిపింది. 187 దేశాల నుంచి సేంద్రీయ సాగు డాటా సేకరించడం జరిగిందని, ఆస్ట్రేలియా 35.7 మిలియన్ హెక్టార్లతో మొదటి స్థానంలో ఉందని, రెండవ స్థానంలో అర్జెంటినా (3.7 మి.హె) మూడవ స్థానంలో స్పెయిన్ (2.4 మి.హె.) దేశాలు ఉన్నాయని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగ భాగం ఆర్గానిక్ ఏరియా ఒక్క ఆస్ట్రేలియా ఖండంలోనే ఉందని తెలిపింది. ఇది ఇలా ఉండాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగ భాగం ఆర్గానిక్ రైతులు ఆసియా ఖండంలో ఉన్నారని, ఇందులో 1.36 మిలియన్ ఆర్గానిక్ రైతులతో ఇండియా మొదటి స్థానంలో ఉందని తెలిపింది.

Post a Comment

0 Comments