Breaking News
Loading...

వ్యవసాయం రంగంలో పచ్చిరొట్టె ఎరువుల ప్రాముఖ్యత


ఆధునిక వ్యవసాయరంగంలో రైతు సంప్రదాయ పద్దతులను పక్కనబెట్టి అధిక దిగుబడులు సాదించాలి అనే లక్ష్యంగావిచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల భూమి స్థితిగతులు మారిపోవటంతో పాటు, నెలలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయీ, చౌడు శాతం పెరిగిపోతుంది, రాష్ట్రంలోని కానీ, దేశంలో కానీ నేలలో సేంద్రీయ కర్బనం తగ్గుతూ వస్తుంది, అది ఒక్క శాతానికి మించి కూడా లేదు, అభివృద్ది చెందుతున్న దేశాలలో సేంద్రీయ కర్బనం  మూడు శాతానికి పైనే ఉంది. ఇలా నూతన సాంకేతిక ఒరవడితో అధునాతన వ్యవసాయంలో మితిమీరి రసాయన ఎరువులు వాడటం వలన మంచి పసిడి భూములు తన సహజత్వాన్ని కోల్పోయి సాగుకు యోగ్యం కాకుండా పోతున్నాయి. ముఖ్యంగా భూమిలో సహజంగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి, పంటలో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి.  ఈ విధంగా భూమి పంటల సాగుకు పనికిరాకుండా పోయీ,  ఎంత పెట్టుబడి పెట్టిన రైతులు దిగుబడి రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నలలను పునరుజీవీంప్పజేయాలీ అంటే తప్పని సరిగా సేంద్రీయ ఎరువులకు ప్రాముఖ్యం ఇవాలి. కానీ  పశువుల ఎరువు, వర్మి కంపోష్టు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు ఇలా  అన్నీ సేంద్రీయ ఎరువులే అయిన వీటి లభ్యత భారంగా మారటంతో రైతులకు పచ్చిరొట్టె పైర్లయిన జనుము, జీలుగా, పిల్లిపెసర్లను  పెంచి నేలలో కలియదున్నడం వల్ల భూసారంను పెంచుకోవచ్చు.

          ఈ విధంగా సేంద్రీయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టే ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో అంటే అవకాశాన్ని బట్టి అంటే మే రెండవ పక్షం నుండి, జూన్ రెండవ పక్షం వరకు రైతు సోదరులు ఏ పంటలు వేయరు కాబట్టి, ఇటువంటి సమయంలో పప్పు జాతి పంటలైన ఈ పచ్చిరొట్టె పేర్లను పూత దశకు రాగానే నెలలో కలియదున్నడం వలన భూమి సత్తువ పెరిగి నేలలో రకరకాల జీవరాసులు వృద్ది చెందుతాయి, అలాగే భూమి కోతకు గురి కాకుండా అరికట్టి, నేలలో అలభ్య రూపంలో ఉన్న పోషకాలన్నింటిని లభ్య రూపంలోకి తీసుకరావటానికి ఈ పచ్చి రొట్టె పైర్లు దోహదపడతాయి.

Post a Comment

0 Comments