Breaking News
Loading...

రైతులకు అందుబాటులో బయో పెస్టిసైడ్స్ : వ్యవసాయ శాఖ



హైదరాబాద్, రైతుముచ్చట: వ్యవసాయ రంగంలో వివిధ రకాల పురుగు మందులతో పాటు జీవ రసాయనాలు(బయో పెస్టిసైడ్స్) కూడా చీడ పీడలను అరికట్టడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనీని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వ, వ్యవసాయ శాఖ నాణ్యమైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ప్లోరొసెన్స్, మెటారైజియమ్ ఎనైసోప్లియే లాంటి జీవ నియంత్రకాలను రాజేంద్రనగర్ లోని రైతు శిక్షణ కేంద్రం ప్రక్కన ఉండే జీవ నియత్రణ ప్రయోగశాలలో ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. కావున ఆసక్తి గల రైతులు ఈ క్రింది చిరునామాను సంప్రదించగలరు.

జీవ నియంత్రణ ప్రయోగశాల
రైతు శిక్షణ కేంద్రం, దర్గా షరీఫ్ ప్రక్కన
రాజేంద్రనగర్-500 030
హైదరాబాద్
ఫోన్: 7288894692, 8374501235, 9581199075

ధరల వివరాలు:
ట్రైకోడెర్మా విరిడి : 100/కిలో
సూడోమోనాస్ ప్లోరొసెన్స్ : 150/కిలో
మెటారైజియమ్ ఎనైసోప్లియే : 100/కిలో

Post a Comment

0 Comments