తెలంగాణ, రైతుముచ్చట : రాష్ట్రాన్ని
“బంగారు తెలంగాణ” గా మార్చాలనే సంకల్పంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో పలు పథకాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతీ
5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) నియమకాన్ని చేపట్టడం
జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ఆశయాల ప్రకారం, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతీ పథకాన్ని రైతు వద్దకు తీసుకెళ్లటంలో, క్షేత్ర స్థాయిలో ఎల్లప్పుడు రైతు వెంటే ఉంటూ, వారి
కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటంలో వ్యవసాయ అధికారులు (AO) & వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) కీలక పాత్ర వహిస్తున్నారు.
ఇలా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ అధికారులు (AO) అప్పగించిన
ప్రతీ పనిని తూచా తప్పకుండా పాటిస్తూ, రాత్రి, పగలు అనే తేడా లేకుండా, సమయంతో సంబంధం లేకుండా డిపార్ట్
మెంట్ కి మూల స్తంభాలుగా AEO లు ఉంటున్నారు.
అయితే వ్యవసాయ శాఖలో చాలా మండలాలలో దాదాపు 200 వ్యవసాయ అధికారి (AO) స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త మండలాల ఏర్పాటుతో ఈ AO ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. దీనితో ఒక వ్యవసాయ అధికారి (AO) కి రెండు మండలాల భాద్యతలు అప్పగించడం వలన పని భారం ఎక్కువటమే కాకుండా క్షేత్ర
స్థాయిలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 40% ప్రమోషన్ ల ద్వారా భర్తీ
చేయాలని ఉన్నా గత నాలుగు సంవత్సరాలుగా అమలుకు నోచుకోక ఇది పెండింగ్ లోనే ఉంది. కావునా
క్షేత్ర స్థాయిలో అన్నీ వేళల రైతుకు అండగా ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను
రైతు వద్దకు తీసుకెళ్లటంలో భాద్యతతో వ్యవహరిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారుల కష్టాన్ని
గుర్తించి ఖాళీగా ఉన్న వ్యవసాయ అధికారి (AO) ప్రమోషన్ల ప్రక్రియ
చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) కోరుకుంటున్నారు.
0 Comments