Breaking News
Loading...

అగ్రికల్చర్ బిజినెస్ చేసే ప్రతీ రైతు గ్రూపుకు (FPO's) 15 లక్షలు

న్యూఢిల్లీ, రైతుముచ్చట: దేశంలో చిన్న, మద్య తరహా రైతుల సంక్షేమం మరియు వారి అభివృద్దే లక్ష్యంగా, రైతులు అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బ్యాంకులు ఇచ్చే రుణాలపై మరియు ఎక్కువ వడ్డి రేటుకు అప్పులిచ్చే వారిపై ఆధారపడకుండా ఉండేందుకు, వారికి ఆర్థికంగా మద్దతు అందించేందుకు “పీఏం కిసాన్ FPO యోజన” పథకంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది2023-24 నాటికి  దేశంలో 10 వేల FPO లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉంది.

పీఏం కిసాన్ FPO యోజన పథకం గురించి క్లుప్తంగా:

పథకం ద్వారా లబ్ది పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక సమూహం/ఆర్గన్సైజేషన్ గా ఏర్పాడాలి, దీనినే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (FPO) అంటారు.

ప్రతీ FPO తమ బిజినెస్ మొదలు పెట్టడానికి 15 లక్షల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతారు

రైతులు గ్రూపుగా ఏర్పడడం వలన కంపనీస్ యాక్ట్ క్రిందకు వస్తారు కావున ప్రతీ రైతు గ్రూపును ఒక కంపెనీగా పరిగణిస్తారు.

తద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15 లక్షల అగ్రికల్చర్ బిజినెస్ పెట్టుబడి సాయంతో పాటు సాధారణంగా ఒక కంపెనీ లబ్దిపొందే అన్నీ ప్రయోజనాలు FPO కి వర్తిస్తాయి.

FPO అనేది కోఆపరేటీవ్ పాలిటిక్స్ నుంచి వేరుగా ఉంటుంది, తద్వారా కోఆపరేటీవ్ యాక్ట్ క్రిందకు రాదు.

అంతేకాకుండా ప్రభుత్వ స్వయం ప్రత్తిపత్తి సంస్థ అయిన నాబార్డ్ FPO’s ను విశ్లేషించి మరింత తోడ్పాటును అందిస్తుంది.

రిజిష్ట్రేషన్ కి అవసరమైన డాక్యూమెంట్స్:

ఆధార్ కార్డ్, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఆదాయ దృవీకరణ పత్రం, పట్టా ధార్ పాస్ బుక్ మరియు బ్యాంకు అకౌంట్ వివరాలు

రిజిష్ట్రేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కొరకు క్రింది లింక్ ను నొక్కండి.

https://enam.gov.in/web/fpo


Post a Comment

0 Comments